చంద్రబాబు ఆంధ్ర ని వదిలేసి తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టడం ఒక విడ్డూరమైతే ఏపీ లో వరదలు ముంచెత్తుతుంటే తాపీగా తెలంగాణ లోని హైదరాబాద్ లో ప్రచారాన్ని తిలకిస్తూ కూర్చోవడం ఇప్పుడు కొంత చర్చనీయాంశమవుతోంది.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు.. పేరుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడే అయినా ఏపీ లో సమస్యల్ని తుంగలో తొక్కేసి ఇక్కడ కూర్చోవడం ఏంటి అని ప్రజలు అంటున్న మాట..

నివర్ తుఫాన్ ఏపీ చిత్తూరు జిల్లాలో విపరీతంగా ఉంది..కుండపోత వానలే కాకుండా వరదలు  కూడా అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తుంది. దాంతో వైసీపీ ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు తలమునకలై ఉండగా చంద్రబాబు ఏమీ పట్టనట్లు ఇక్కడ ప్రచారం చేసుకోవడం వివాదంగా మారేలా ఉంది. పోనీ తెలంగాణాలో అయినా ప్రచారానికి వెళ్లి పార్టీ ని గెలుపిస్తున్నారా అంటే అదీ లేదు.. ఇద్దరు ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ 1న  జరుగబోతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీ లు ప్రచారాల హోరు ను తలపిస్తున్నాయి.. ఆయా పార్టీ ల నేతలు ప్రచార సభల్లో వరాలు, విమర్శలు కురిపిస్తున్నారు. అయినా తమకు పట్టనట్లు ఉండడం బహుశా చంద్రబాబు రాజకీయ చరిత్రలోనే తొలిసారి కావచ్చు. ఓ వైపు టీడీపీ తరపున నిలబడిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.. తాము అండగా ఉండాల్సిన వారు ఇలా చేతులెతేయడం వారికి తీరని సమస్యగా మారిపోయింది.. మాములుగా ఎలక్షన్స్ అంటే  ఈపాటికే రోజూ వీడియో కాన్ఫరెన్సులు, కార్యకర్తలకు దిశానిర్దేశాలు, స్కెచ్లు, ప్లాన్లతో అదరగొ ట్టడం, మీడియాలో ఊదరగొట్టడం ద్వారా చాణక్యుడు, చంద్రగుప్తుడు అని కిరీటాలు చంద్రబాబు తనకు తానే తగిలించుకోవడం జరిగేవి, అయితే ఇప్పుడు అదేం లేకుండా ఆయన ఆజ్ఞాత వాసంలో గడుపుతుండడం విచిత్రమైన ని కార్యకర్తలు భావిస్తున్నారు. మరి అటు ఏపీని పట్టించుకోక, ఇటు తెలంగాణ ని పట్టించుకోక చదన్రాబాబు పార్టీ ని ఎందుకు నడుపుతున్నాడో ఆయనకే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: