పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటున్నా అప్పుడప్పుడు రాజకీయ విషయాల్లో మెరిసి మాయమైపోతున్నాడు..  ఇటీవలే గ్రేటర్ ఎన్నికలో పాల్గొనడం లేదని చెప్పి జనసేన అభిమానులను నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో పాల్గొనేది కూడా స్పష్టత ఇచ్చాడు..గత ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచి నిరాశపరిచిన పవన్ కళ్యాణ్ ఆ తరవాత రాజకీయాల్లో చేసేదేం లేక మళ్ళీ సినిమా బాటపట్టిన పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటిషన్ అనే పేరు ను మోస్తూ మళ్ళీ ఎన్నికలనాటికి అవసరమయ్యే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ లో విలీనమైపోయాడు..

అప్పటినుంచి పార్టీ ని గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ గా ఉంటున్నారు.. ఇక ఆవేశంతో ఊగిపోవడం, పిడికిలి బిగించి ఆకాశానికి చూపించడం, జుట్టు సరిచేసుకుంటూ ముందుకు నడవడం, అప్పుడప్పుడు సిగ్గుపడటం, ఆ వెంటనే తన చిన్నప్పటి సంగతులతో నవ్వించడం..ఇలా  సీరియస్ గా ఉండే రాజకీయాలను ఫన్నీ చేసేసి ప్రజలకు వినోదం పండించేవారు పవన్ కళ్యాణ్ ను ప్రజలు బాగా మిస్ అవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తిరుపతి లో అవన్నీఈ చూడొచ్చనుకున్నవారి ఆశలపై పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారు.  

తిరుపతి లో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అయినా పోటీ చేయాలనీ నిర్ణయించుకుంది. దాంతో జనసేన పోటీ చేయడం  సందేహంగా ఉంది.. ఇదే విషయమై పవన్ కళ్యాణ్ ఢిల్లీ కి వెళ్లి మంతనాలు జరిపారు. కోరుకున్న పని జరక్కపోవడం తో పవన్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాగని ఉన్న పళంగా బీజేపీని తిట్టిపోసి వెనక్కు వచ్చేసే తెగింపు లేదు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఏదో ఒక పార్టీని నమ్ముకుని ఉండడం తప్ప తనకు వేరే దారి లేనందున వెంటనే ప్లేట్ మార్చేశారు. అయితే ఉన్న విషయం డైరెక్ట్ గా చెప్పేదానికి మేము ఢిల్లీ వెళ్ళింది తిరుపతి ఎన్నికల కోసం కాదు రాష్ట్ర ప్రయోజనాలు మాట్లాడడానికి అని బొంకడమేంటి అని అంటున్నారు.. మరి తిరుపతి పై పవన్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: