బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం చేయడం ఏమో గాని ఇప్పుడు వస్తున్న కొన్ని కొన్ని ఇబ్బందులు మాత్రం భారతీయ జనతా పార్టీని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి.. కొంత మంది కార్యకర్తలు కూడా కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఆయన అన్ని విధాలుగా కూడా ముందుకు నడిపించాల్సి ఉంటుంది. కానీ ఆయన చేసే వ్యాఖ్యలు అదేవిధంగా ఆయన జోక్యం చేసుకున్న కొన్ని కొన్ని అంశాలు కూడా చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

నిన్న మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ పి.వి.నరసింహారావు సమాధులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యల విషయంలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా స్పందించారు అనే భావన చాలా మందిలో ఉంది. ఆయన స్పందించడం వల్ల భారతీయ జనతా పార్టీ వచ్చే ఉపయోగం కూడా పెద్దగా ఏమీ లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు అలాంటి భావోద్వేగాలను ఒకవేళ భారతీయ జనతా పార్టీ రగిల్చే ప్రయత్నం చేసినా... సరే హైదరాబాదులో ఎక్కువగా ఉండే విద్యావంతులు ఆ పార్టీకి ఓటు వేస్తారు అనుకోవడం కూడా భ్రమే అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది.

అయితే బండి సంజయ్ మాత్రం ఇలాంటి అనవసరమైన విషయాలలో స్పందించకుండా ఉంటే మంచిది అని అసలు ఆ పార్టీ అంశం అది కాదు అని... కాబట్టి ఆయన కొన్ని కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళే లేకపోతే మాత్రం నవ్వులపాలు కావడం ఖాయమని  అంటున్నారు. ఎన్నికలు కీలకమైన విషయం అని గుర్తుపెట్టుకుని వ్యవహరించకపోతే పార్టీ ఇబ్బంది పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి బండి సంజయ్ జాగ్రత్తగా ఉంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: