రేవంత్ రెడ్డి పార్టీ మారే అంశానికి సంబంధించి ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆసక్తి కరంగానే చూస్తున్న పరిస్థితి. అయితే ఆయన పార్టీ మారతారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పార్టీ మారితే ఆయనకు ఇవ్వాల్సిన బాధ్యత విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఎక్కువగానే ఫోకస్ చేసారు అని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఆయన కచ్చితంగా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు అంటే మాత్రం ఇంకా పార్టీని ప్రజలు కూడా మర్చి పోయే అవకాశం ఉంటుంది.

కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆయన కచ్చితంగా బీజేపీ లోకి వస్తే ఆయనతో పాటు బీజేపీ కూడా కాస్త బలపడే అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలాగో భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకు వెళుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సేవలను కూడా సమర్థవంతంగా పార్టీ వినియోగించుకునే అవకాశాలు ఉండవచ్చు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

కానీ రేవంత్ రెడ్డి పార్టీ మారతారా లేదా అనేదానిపై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. ఆయన పార్టీ మారితే మాత్రం ఆయనకు కీలక పదవి ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇస్తున్నారు.  2024 ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ మల్కాజిగిరి నుంచి ఎంపీ సీట్ ఇస్తామని పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇస్తున్న పరిస్థితి. అయితే కొంతమంది నేతలను మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ లోకి తీసుకురావాలని వారు సూచన చేస్తున్నారని కూడా తెలుస్తుంది. మరి కొంతమంది నేతలు వస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: