తెలుగుదేశం పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీ అనుకూల మీడియా ఆ పార్టీకి సహకరించడం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమౌతుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలావరకు ప్రచారం చేస్తున్న సరే ఆ పార్టీ నేతలకు అదేవిధంగా కార్యకర్తలకు మీడియా నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందడం లేదు. టిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా...

ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో కూడా కనీసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్న ప్రచారాన్ని చూపించలేని స్థితిలో ఉంది అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కనీసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేస్తున్న ప్రచారాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోతున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు డైరెక్టర్ గా విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులు తమకు అనుకూలంగా ఉన్న మీడియా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన విమర్శలు ప్రతి విమర్శలు ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నది అని ఆవేదన వ్యక్తం చేసారు.

దీని వలన తాము కనబడటం లేదు అని ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతలను కార్యకర్తలను వెంటాడుతుంది. ఇక సోషల్ మీడియా లేకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ కనీసం ప్రచారం చేస్తుంది పోటీ చేస్తుంది అనే విషయం కూడా చాలామందికి అర్థం అయ్యే పరిస్థితి ఉండదు అనే భావన ఉంది. మరి తెలుగుదేశం పార్టీని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంతవరకు పార్టీ మీడియా కాపాడుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం ఇప్పుడు హైదరాబాదులో కాస్త హాట్ టాపిక్ గా మారాయి. మరి భవిష్యత్తులో ఎలా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: