ఒకవైపు నివర్ తుఫాన్ తాకిడి తెలుగు రాష్ట్రాలను కుదించి వేస్తుంది.. మరోవైపు తెలంగాణ లో గ్రేటర్ ఎన్నికలు ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి.. ఎన్నికల వేడి మాత్రం హైదరాబాద్ లో రచ్చ చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో ఎవరికీ వారే తోపులు అన్నట్లు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా పోలీసులు కూడా ఇక్కడ ఘర్షణలు జరగకుండా అన్నీ రకాల చర్యలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎప్పుడు ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక నిజాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగేలా కఠిన చర్యలను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు మద్యం అమ్మకాలను కూడా బంద్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది..



ఇకపోతే తెలంగాణ ఎన్నికల పై సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారం చేయకూడదు పోలీసులు కమీషనర్ సత్వర చర్యలను తీసుకోవాలని పోలీసులకు సూచించారు.ఈ మేరకు తాజాగా డిజిపి మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. సందర్బంగా ఆయన మాట్లాడుతూ..క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదు తో తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశాము.. విచారణ కూడా చేస్తున్నారు. ఈ ప్రచారం జరుగుతున్న కూడా కొందరు నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై 50 కేసుల వరకు నమోదు చేశాము..



గత 6 సంవత్సారాల్లో ఎలాంటి ఘటనలు హైదరాబాద్ లో చోటు చేసుకోలేదు..హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యతగా ముందుకు సాగుతున్నారు.జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ సిద్ధం అయ్యింది.పోలీసులు తీసుకునే ప్రతి చర్య కు ప్రజల సహకారం అవసరం ఉండాలి. అప్పుడే పోలీసులు తమ విధులను ఖచ్చితంగా నెరవేరుస్తారు.కొన్ని చోట్ల కొంత మంది విద్వేషాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నట్టు మా దగ్గర సమచారం ఉంది.ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కట్టిన చర్యలు తీసుకుంటాం..సోషల్ మీడియా పోస్ట్ ల పై పోలీసులు పూర్తి. స్థాయిలో నిఘా పెట్టారు.ఈ మూడు కమిషనరేట్ లో 51,500 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తు లో పాల్గొంటారు..ఎక్కడ ఏ ఘటన జరిగినా వెంటనే స్పందించే విధంగా టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి.. ప్రజలు మాత్రం పూర్తి సహకారాన్ని అందిస్తే పోలీసులు ఎన్నికల్లో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: