తెలంగాణలో ఇప్పుడు కిషన్ రెడ్డి పాత్ర ఏంటి అనే దానిపై చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఆయన చేస్తున్న కొన్ని కొన్ని ఆరోపణలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ టాపింగ్ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫోన్ టాపింగ్ జరిగితే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజాగా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కొన్ని ఆరోపణలు చేశారు.

సర్జికల్ స్ట్రైక్స్ ఆరోపణల వెనుక కిషన్ రెడ్డి డి ఉన్నారని కొంతమంది వ్యాఖ్యానించారు. బండి సంజయ్ మాట్లాడిన తర్వాత వెంటనే కిషన్ రెడ్డి కూడా పాతబస్తీలో ఎక్కువగా రోహింగ్యాలు ఉన్నారు అనే వ్యాఖ్యలు చేశారు. అయితే రోహింగ్యాలు ఉంటే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తున్నా సరే ఆయన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరి ఓటు హక్కు ఇచ్చిన ఎన్నికల సంఘం మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కిషన్ రెడ్డి చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయినప్పుడు చర్యలు తీసుకోవడంతో పాటుగా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చే అధికారం ఉంటుంది. అయినా సరే ఆయన కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయకుండా నేరుగా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆయన ఎన్నికల సంఘం మీద ఎక్కువగా ఆధారపడటం తో అసలు ఏం జరుగుతుంది అనే చర్చలు ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: