గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఇప్పుడు బయటకు వెళ్లడం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తాజాగా మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ పార్టీ మారడం టిఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందికర పరిణామమే అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆయనతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ఉద్యోగ సంఘాల నేతలు అందరూ కూడా తెలంగాణా నినాదంతో ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా పార్టీ మారడానికి ఆసక్తికరంగా ఉన్నారని అంటున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో తమకు ప్రాధాన్యత లేదని భావించిన చాలామంది నేతలు ఇప్పుడు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. కాబట్టి వారందరితో కూడా ఇప్పుడు బిజెపి రాష్ట్ర నాయకత్వం ఎక్కువగా చర్చిస్తున్నారు. స్వామిగౌడ్ తో మంచి సంబంధాలు నేతలందరితో కూడా బిజెపి రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన నుంచి కొంత సమాచారాన్ని సేకరించారని తెలుస్తుంది. స్థానికంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉండే ఉద్యోగ సంఘాల నేతలను పార్టీలోకి తీసుకురావాలని స్వామిగౌడ్ కి బీజేపీ నేతలు సూచనలు చేసినట్లు తెలుస్తున్నది. అయితే పార్టీ ఎవరు మారుతారు అనేది చూడాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత మంది నేతలను స్వామి గౌడ్ ఇప్పుడు బీజేపీ లోకి తీసుకుని వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అక్కడ అవకాశాలు ఉన్నాయని చాలా మంది నేతలకు ఇప్పటికే బీజేపీ నుంచి ఆఫర్లు కూడా వెళ్ళాయి. మరి స్వామిగౌడ్ ఎంత మందిని తీసుకు వస్తారు ఏంటి అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: