గ్రేటర్ హైదరాబాద్ లో కొంతమంది బీజేపీ నేతలు పార్టీ మారవచ్చని ప్రచారం ఉన్న నేపథ్యంలో అసలు ఎవరు ఏంటి అని దానిపై ఇప్పుడు ఆసక్తికరంగా చర్చలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరిని టార్గెట్ చేశారు ఏంటి అనే దానిపై ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొంత మంది నేతలతో ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా సమావేశాలు నిర్వహించింది అనే ప్రచారం జరుగుతోంది. అయితే కొంతమంది నేతలు మాత్రం కొన్ని కొన్ని డిమాండ్లను ఎక్కువగా పెట్టడంతో టిఆర్ఎస్ పార్టీ కాస్త ఎక్కువగా ఇబ్బంది పడుతుందని సమాచారం.

మాజీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారడానికి రెడీ అయి... బిజెపి నుంచి మరికొంత మందిని తీసుకు రావడానికి కొన్ని షరతులు పెట్టినట్టుగా సమాచారం. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు వారి డిమాండ్లను తీర్చడానికి కాస్త ఇబ్బంది పడుతుందని సమాచారం. బలంగా ఉన్న నేతలను కొంతమందిని ఆకర్షించాలని ప్రయత్నం చేసినా సరే వాళ్ళు వచ్చే ఎన్నికల్లో కావాల్సిన స్థానాలపై ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉంది.

అయితే ఇప్పుడు కొంత విషయంలో మాత్రం కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరిని పార్టీలోకి తీసుకుంటారు ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. అయితే కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ఇద్దరు స్థానిక నేతలు తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వారిద్దరికీ మంచి పట్టు ఉందని కాబట్టి వారిద్దరినీ బిజెపిలో నుంచి బయటకు తీసుకు వస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితం ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. మరి వాళ్ళు బయటికి వస్తారా లేదా అనేది చూడాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మరి భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: