చైనా కి అమెరికా చెక్ పెట్టబోతుందా  అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలలు చూస్తే  మాత్రం అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు చైనా విస్తరణ వాదంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది  అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విస్తరణ వాదంతో వివిధ దేశాల పై ఆధిపత్యం సాధించేందుకు వివాదాలకు కూడా తెరలేపింది. ఈ క్రమంలోనే భారత్-చైనా సరిహద్దు లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని  ఉద్రిక్తంగా మార్చి భారత్తో వివాదానికి తెరలేపింది. అదేసమయంలో జపాన్ దీవులను  కూడా తమ దేశానికి చెందిన దీవులు అని చెప్పుకుంటూ జపాన్ దేశం తో కూడా ప్రస్తుతం వివాదానికి తెరలేపింది చైనా.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో... ప్రస్తుతం రానున్న రోజుల్లో చైనాకి అమెరికా చెక్ పెట్టబోతుందా అంటే అవును అనే అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే.. సాధారణంగా అమెరికాలో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి అమెరికా ప్రజలను మానసికంగా సంతృప్తిపరచడానికి ఏదో ఒక దేశం పైన అమెరికా యుద్ధం చేస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. గతంలో ఇలా ఎన్నో సార్లు జరిగింది. అయితే ట్రంపు హయాంలో ఇప్పటివరకు యుద్ధం జరగలేదు. కానీ జో బైడెన్  హయాంలో మాత్రం యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా చైనాకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే విధంగా అమెరికా స్టేట్మెంట్ ఇవ్వడం కాస్త ప్రస్తుతం సంచలన గా మారిపోయింది. చైనా అంతర్జాతీయ నియమనిబంధనలను  తూచా తప్పకుండా గౌరవించాలని... అందుకు అనుగుణంగానే నడుచుకోవాలని ఇటీవలే అమెరికా స్టేట్ మెంట్ ఇచ్చింది.. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. ఇప్పటికే.. అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి జపాన్ భారత్ దేశాల సరిహద్దుల వివాదాలు సృష్టించిన చైనా అదే సమయంలో దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదే అంటూ ప్రపంచ దేశాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ విషయంలో అమెరికా ప్రస్తుతం చైనా కు వార్నింగ్ ఇచ్చినట్లు  విశ్లేషకులు అంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: