ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పాలన లో ఓ కొత్త ఒరవడిని శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా పాలన సాగిస్తూ ఇతర దేశాలకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే ఈ నేర చరిత్ర కు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరస్తుల పై ఉక్కుపాదం మోపి ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసి నేరాలను పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఒక సన్యాసం  తీసుకున్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం ఏంటి అనే స్థాయి నుంచి ముఖ్యమంత్రి అంటే ఇలాగే ఉండాలి అనే స్థాయికి ఎదిగారు ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్.



 అన్ని రకాల బంధాలను భావోద్వేగాలను దూరం చేసుకుని సన్యాసం తీసుకున్న ఒక వ్యక్తి పాలన చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు నేరాలపై ఉక్కుపాదం మోపుతూనే  మరోవైపు రహదారులపై ఆయుర్వేద మొక్కలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అటవీ పరిరక్షణ కోసం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదేసమయంలో ప్రజలందరికీ మెరుగైన పాలన అందించడంలో కూడా ఎంతో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.



 ఇక జీవకారుణ్య అనే కార్యక్రమంలో చేసినటువంటి దానికి ఇటీవలే ఏకంగా అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. 2014 నాటికి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పిలిభిత్  లో ఉన్నటువంటి 24 పులులు  ప్రస్తుతం 2018 కి 65 పులులకు  చేరాయి. దీనికిగాను అంతర్జాతీయ అవార్డు అందుకున్నాడు యోగి ఆదిత్యనాథ్. పులుల సంరక్షణ కేంద్రంలో ఎంతో సమర్థవంతంగా నిర్వహణ చేయడం వల్లనే ఇదంతా సాధ్యమైంది అని విశ్లేషకులు అంటున్నారు. మరోసారి ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ సమర్ధుడు అని నిరూపించుకున్నారు అని  విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: