పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన విషయం తెలిసిందే. తమ  దేశంలో ప్రజలు అక్షరాస్యత రోజు రోజుకి తగ్గిపోతున్న  ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసి ఏకంగా ఉగ్రవాదులను పెంచి పోషించడమే లక్ష్యంగా మత రాజ్యస్థాపన చేయడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని యువతకు ఉగ్రవాదం  ఒక్కటే ఉపాధి అన్న విధంగా అక్కడ యువత ఆలోచనా విధానాన్ని మారుస్తూ యువత  అందరూ ఉగ్రవాదం వైపు నడిచేలాగా  ఉగ్రవాదులు అనే వారు ఏకంగా స్వాతంత్ర సమరయోధులు అనే రేంజ్లో కవరింగ్ ఇస్తూ  ఉంటుంది. ఈ క్రమంలోనే చైనా ఎప్పుడు ఉగ్రవాదులను పెంచి పోషించడానికి పాకిస్థాన్కు సహాయం చేస్తూ ఉంటుంది అన్న వాదన ఉంది అన్న విషయం తెలిసిందే




 ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించాలని అనుకుంటున్న చైనా స్వయంగా తాము చేయాలనుకున్న  దురాగతాలు అన్నింటిని పాకిస్థాన్తో  చేయిస్తూ ఉంటుంది అనేది ప్రపంచ దేశాలు భావిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులను పెంచి పోషించడానికి చైనా ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉంటుంది అని ఒక భావన కూడా ఉంది ప్రపంచదేశాల్లో. ఇక ఇటీవల ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికా ఉగ్ర దేశం పాకిస్థాన్ కాదు చైనా అంటూ ఇటీవలే ప్రకటించడం సంచలనంగా మారిపోయింది. అమెరికాలోని కొన్ని సంస్థలు చైనా ఒక ఉగ్ర సంస్థ అని స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది.




 అయితే పాకిస్తాన్కు చెందిన కొన్ని సంస్థలు ఇలా చైనాను ఉగ్రవాద సంస్థగా స్టేట్ మెంట్ ఇవ్వడానికి వెనుక చాలా కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం చేస్తూ ఉగ్రవాదుల పోషించేందుకు వెన్నుదన్ను అందించడంతో పాటు.. పీవోకేలో ఉగ్రవాదులతో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి... అంతే  కాకుండా చైనా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించాలి అనుకున్న చోట ఉగ్రవాదులను పంపి  విధ్వంసం సృష్టించేందుకు.. ఉగ్రవాదులు ఎక్కువగా చైనా వాడుకుంటున్నది. అందుకే చైనాను అమెరికా సంస్థలు ఉగ్రవాద సంస్థగా స్టేట్మెంట్ ఇచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: