గ్రేటర్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ గారు విసృతంగా దూసుకుపోతునారు. ఈ క్రమంలో ఆయన గురువారం అల్వాల్‌ చౌరస్తాలో రోషోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని కొనియాడారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు..ఈ ఆరేళ్ల పాలనలో తెలంగాణలో ఉన్న ఎన్నో సమస్యలను అధిగమించామని,ప్రపంచం లోనే దిగ్గజ కంపెనీలుగా పేరున్నా అమెజాన్‌, యాపిల్‌, గూగుల్ వంటి‌ కంపెనీలను హైదరాబద్‌కు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్‌, ఏం చేశాయో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రూ. గత ఆరేళ్లలో రూ. 2 లక్షల72 వేల కోట్లు పన్ను రూపంలో కేంద్రానికి కట్టినట్లు వెల్లడించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.లక్షా 40 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కరోనా, వరదల సమయంలో ప్రజలను ఆదుకుంది ఒక్క టీఆఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: