గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం చూస్తుంటే, ప్రజలను బుట్టలో వేసుకునేందుకు నాయకులు పడుతున్న తపన, ఆందోళన , టెన్షన్ అంతా ఇంతా కాదు. గ్రేటర్ వార్ లో గెలుపు తమ ఖాతాలో వేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు శక్తికి మించి గట్టిగానే కష్టపడుతున్నాయి. పోటీలు పడి మరీ ప్రజలకు వరాల జల్లులు కురుస్తున్నాయి. ఇందులో ఎవరూ తక్కువ కాదు అన్నట్టుగా అన్ని పార్టీలు జనాలకు వరాల జల్లులు కురిపిస్తూ, మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, వారి సానుభూతి సంపాదించుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.




 ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఎన్నో ఉచిత హామీలను ప్రజలకు ఇస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  తెలంగాణలో ఉచితంగా మంచినీళ్ళను అందిస్తామని ప్రకటించడంతో పాటు, ఎన్నో ఎన్నెన్నో ఉచిత  హామీలను ప్రజలకు అందిస్తున్నారు. ఇక బిజెపి విషయానికి వస్తే గ్రేటర్ పరిధిలో ఇస్తున్న హామీలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.వరద బాధితుల కుటుంబాలు ఒక్కొక్కరికి 25 వేల చొప్పున నగదు సహాయాన్ని అందిస్తామని ప్రకటిస్తున్నారు. అలాగే ఇటీవల వరదల్లో ఆస్తి నష్టం సంభవించిన ప్రజలను ఆదుకునేందుకు బండి కి బండి, కుర్చీకి కుర్చీ, ఇల్లు కు ఇల్లు, అంటూ ఎన్నో హామీలు ఇస్తున్నారు.




 ఇక కాంగ్రెస్ సైతం తామేమీ తక్కువ తినలేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. వరద బాధిత కుటుంబాలకు 50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని అందరికంటే గొప్పగా ప్రకటించుకున్నారు. ఇవన్నీ ఉదాహరణ కు  మాత్రమే. ఇంకా అన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు చూస్తే , ప్రజల పై ఎంత ప్రేమ ఉందో అర్థం అయిపోతుంది. ఇవన్నీ అమలు చేస్తారా అనేది కూడా అందరికీ అనుమానంగానే ఉంది. ఎన్నికలు అన్నాక నాయకుల హామీలు సర్వసాధారణమని వాటిని అమలు చేసి చూపించే వాళ్ళే తక్కువ అని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: