గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోరు ఉండునట్లు తెలుస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో కొన్ని పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ టిఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టిపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీలలో ఉండే అసమ్మతి నాయకులను ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు పార్టీలు. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇటీవల టిఆర్ఎస్ కీలక నేత స్వామి గౌడ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన తర్వాత టిఆర్ఎస్ పైన స్వామిగౌడ్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 ప్రతి ఇంట్లో ముగ్గురు పిల్లలను కనండి.  ఆ మధ్య శాసన మండలి చైర్మన్ గా ఉండి ఇదేమాట అంటే రచ్చ చేశారు.  అదేమాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వామి గౌడ్ మాట్లాడుతూ.. కొంతమంది కేసీఆర్ కౌన్సిలర్ చైర్మన్ పదవి ఇచ్చాడు కదా.. నీకేం తక్కువ చేశాడని అంటున్నారు.  నన్నేం రోడ్డు మీద ఉంటె తీసుకొచ్చి చైర్మన్ చేయలేదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో నాకు ఏమాత్రం విలువ లేదు అని ఆయన ఆరోపించారు.  రెండుసార్లు పోలీసులు తనను చంపడానికి ప్రయత్నించారని, ఆత్మాభిమానం లేని ఏ పదవి తనకు అవసరం లేదని స్వామి గౌడ్ వ్యాఖ్యానించారు.  

రెండేళ్ల నుంచి రెండు నిమిషాల టైమ్ తనకు కేసీఆర్ ఇవ్వలేదని, కేసీఆర్ ను తండ్రిలా భావించానని, చెప్పుడు మాటలు విని తనను దూరంగా పెట్టారని అన్నారు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇతర పార్టీలో ఉండి తన పార్టీలోకి చేరినవారికి మంత్రి పదవులు ఇచ్చాడు పార్టీని నమ్ముకున్న తనకు మొండి చెయ్యి చూపించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకనే టిఆర్ఎస్ పార్టీని వీడినట్లు ఆయన ప్రకటించారు.  పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్ లపై చేయి వేస్తె ఊరుకునేది లేదు అని చెప్పిన దమ్మున్న మొనగాడు బండి సంజయ్ అని, పార్టీకి అటువంటి బలమైన నాయకత్వం కావాలని అన్నారు స్వామిగౌడ్. మరి స్వామి గౌడ్ వ్యాఖ్యలకు టిఆర్ఎస్ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: