దుబ్బాక లో గెలిచినా ఉత్సాహమో ఏమో కానీ బీజేపీ ఏం చెప్తే అదే జరిగిపోతుందని అనుకుంటుంది.. అంతేకాదు కేసీఆర్ వేసే పంచ్ లకు లొసుగులు, లాజిక్ లు కూడా వెతుకుతుంది..  ఇటీవలే కేసీఆర్ పార్టీ మేనిఫెస్టో ని రిలీజ్ చేస్తూ ప్రసంగం ఇచ్చారు.. నిజానికి కేసీఆర్ ప్రసంగం ఇస్తుంటే ఎంతటివారైనా ముగ్దుడవక తప్పరు. అయన ప్రసంగం మధ్య లో వేసే ఛలోక్తులు, వాడైనా మాటలు చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే,,ప్రత్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసే కొన్ని కామెంట్లు.. వాళ్లను మరీ తేలిక చేస్తూ వేసే కౌంటర్లు భలేగా ఉంటాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలామంది ఆయనకు, అయన ప్రసంగానికి అభిమానులు ఉంటారు.. ఐతే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన ప్రసంగంలో లాజిక్ ని బయటపెట్టి దీన్ని కూడా ఓ లాజిక్ అంటారా అనేట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.

తెలంగాణ లోని దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితం రాష్ట్రానికే కాదు దేశానికే పెద్ద షాక్ లాంటిది అని చెప్పొచ్చు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరినుంచి ఇక్కడ టీ ఆర్ ఎస్ కు ఎదురులేదు..  అందుకే గత రెండు ఎలక్షన్స్ నుంచి గెలుస్తూ వస్తుంది. కేసీఆర్ కూడా ఇంతటి విజయాన్ని ఊహించలేదని చెప్పాలి. తొలి సారి కంటే రెండో సారి అనూహ్యమైన మెజారిటీ తో గెలిచింది టీ ఆర్ ఎస్ పార్టీ.. అయితే గత కొన్ని నెలలుగా కేసీఆర్ అవలంభిస్తున్న విధానాలు ప్రతిపక్షాలకు కాదు ప్రజలకు కూడా విసుగు తెప్పిస్తున్నాయి.. అందుకే ప్రజలు కేసీఆర్ కి వార్నింగ్ లా దుబ్బాక లో గులాబీ పార్టీ ని ఓడించారు..

అయితే అయన గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ని రిలీజ్ చేసే సమయంలో జనాలు వేరే పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే అది హైదరాబాద్‌కు మంచిది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా అభివృద్ధి జరగదని.. రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వేస్ట్ అని తేల్చేశారు. తద్వారా జీహెచ్ఎంసీని బీజేపీ చేజిక్కించుకుంటే తాము సహకరించేది లేదని చెప్పకనే చెప్పేశారు.కానీ ఇదే లాజిక్ కేంద్రం-రాష్ట్రం విషయంలో అప్లై చేసి చూస్తే ఎవరూ టీఆర్ఎస్‌కు ఓటే వేయకూడదు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి.. ఇక్కడ వేరే పార్టీకి అధికారం కట్టబెడితే వాళ్లు సహకరించరు కాబట్టి అభివృద్ధి జరగదని.. కాబట్టి బీజేపీకే ఓటేయాలని అంటే ఎలా ఉంటుంది అని బీజేపీ అంటుంది.. ఈ లాజిక్ కి ప్రజలు బీజేపీ కి మొక్కాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: