ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇటీవలే తెలంగాణ లో జరిగే గ్రేటర్ హైదరాబాద్ లో ఎలక్షన్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.. కొన్ని ప్రాంతాలకు అభ్యర్థులను ఫైనల్ చేసిన చంద్రబాబు ఆ ప్రాంతాలకు ఇంతవరకు ప్రచారానికి వెళ్ళకపోవడం చూస్తుంటే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. నిజానికి అభ్యర్థులు వారు వస్తారనే నమ్మకంతో నే పార్టీ తరపున టికెట్ పుచ్చుకున్నారు. తీరా పోలింగ్ సమయం దగ్గరపడుతున్న చంద్రబాబు అసలు ప్రచారానికి రాకపోవడం వారిలో కొంత ఏండ్లనా కలిగిస్తుంది..

ఓవైపు బీజేపీ, టీ ఆర్ ఎస్ పార్టీ లు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్  ఇక్కడ ఎలాగైనా గెలవాలని ప్రచారం చేస్తున్నారు.  దుబ్బాక మిగిల్చిన ఫలితమే ఏమో కానీ గ్రేటర్ ఎన్నికలను మాత్రం కేసీఆర్  సీరియస్ గా తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబద్ ఎన్నికల్లో ఏ మాత్రం తేలిగ్గా తీసుకోకూడదని.. కేసీఆర్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకోసం తగిన ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నారు.. హైదరాబాద్ లో ఇప్పటికే కొంత బ్యాడ్ నేమ్ వరదల రూపంలో ముంచెత్తింది.. దాన్ని కవర్ చేసుకోవాలంటే గతంలో కంటే ఎక్కువగా పనిచేయాలని కేసీఆర్ భవించాడు.

ఇప్పటికే అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లోనే ప్రచారానికి వెళ్లని కేసీఆర్ కి అక్కడి ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అయితే ఇప్పుడు కూడా చేయకపోతే పార్టీ కి ఎదురుదెబ్బ తగులుతుందని భావించి గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అయన కాకున్నా లోకేష్, బాలకృష్ణ ల్లో ఎవరైనా ఒకరు రావాల్సి ఉంది.. వీరెవరూ రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే వీరు ప్రచారం చేయకపోవడానికి కారణం లేకపోలేదట.. తెలంగాణలో ప్రచారం చేసి రేపు ఫలితాల్లో ఓట్ల శాతం దారుణంగా ఉంటే ఏపీలోని తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రభావం పడుతుందనే చంద్రబాబు అండ్ కో దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: