హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరు నానాటికీ పెరుగుతూ వస్తుంది. బరిలో ఉన్న పార్టీలు ఎవరికీ వారే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా నిన్నటి వరకు టీఆరెఎస్, బీజేపి లు ప్రచారంతో నగరంలో హోరెత్తించారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు బరిలోకి దిగాయి..కాగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఇద్దరు మహిళలు అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.వీరి గురించి జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎందుకంటే వీరు సాధారణ కార్పొరేటర్ అభ్యర్థులు మాత్రం కారు. ఆర్థికంగా ఎంతో అడుగు స్థాయిలో ఉన్నారు. ఇలాంటి వీరు ఎన్నికల్లో పోటీ చేస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 



వీరిద్దరూ కూడా మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన వారే.. ఒకరు ఫర్హనా బేగం, మరొకరు రేఖ.. ఫర్హానా బేగం ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ భార్య. ఇక రేఖ బట్టలు ఇస్త్రీ చేస్తుంటారు. తమ ప్రాంతాల్లో గతంలో ఎంతో మంది కార్పొరేటర్లు వచ్చినా సమస్యలు పరిష్కారం కావట్లేదని అందుకే తాము బరిలోకి దిగినట్లు మీడియాలో ఆసక్తి కర విషయాలను చెప్పుకొచ్చారు.భర్త నాలుగు చక్రాలు కదిలితే కానీ ఇంట్లో వాళ్లకు నాలుగు వేళ్ళు నోటిలోకి వెళ్లవు.. అటువంటి ఆమె ఇంటింటికీ వెళ్లి ఓట్లు ఆడుగుతున్నారు.మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని ఆమె పిలుపునిస్తోంది.



ఇకపోతే రేఖ.. బట్టలు ఇస్త్రీ చేసుకొని జీవనం సాగించే రేఖ కూడా చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ కాలనీ రోడ్లపై ఎప్పుడూ మురుగు నీరు ప్రవహిస్తూ ఉంటుందని, ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోలేదని ఆమె అన్నారు. అందుకే, టీడీపీ తరపున ఈసారి తానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు.. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే స్థానిక సమస్యలను తీరుస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మీడియా ఛానెల్స్ ఫోకస్ మొత్తం వీరిద్దరిపై ఉండటంతో ఈ ఎన్నికల విజయం పై టీడీపీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో డిసెంబర్ 4 వ తేదీన చూడాల్సిందే... మహిళలు ఎక్కడా తక్కువ కాదని ఈ ఇద్దరు మహిళలు నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: