బీజేపీ మత కల్లోహాలు సృష్టిస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తోందని మల్లేపల్లి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌ లోకా భూమారెడ్డి అన్నారు. మల్లేపల్లిలో జరిగిన ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తిర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రశాంతతకు మారుపేరైన హైదరాబాద్‌కు విదేశాల నుంచి ఎన్నో కంపెనీలు పెట్టుబడి పెట్టాయని ఆయన తెలియజేశారు. హైదరాబాద్‌లో నెలకొల్పిన కంపెనీలతో ఎంతో మందికి ఉపాధి కలుగుతోందని వివరించారు.

టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధిని చూసి కొందరు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా ప్రజలందరూ కలిసి టీఆర్ఎస్ కి ఓటు వేసి తగిన జవాబివ్వాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే మేయర్‌ సీటు అని జోష్యం చెప్పారు. టీఆర్ఎస్ కే ప్రజలు మొగ్గు చూపుతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మల్లేపల్లి డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మెట్టు వాణి, దేవరి ప్రభాకర్, మన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్పుడు రాని వాళ్లు.. ఇప్పుడెలా వస్తున్నారు...
రెడ్‌హిల్స్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రియాంకగౌడ్‌ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్‌ మొత్తం ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పాదయాత్ర, ఇంటింటికీ ప్రచారం చేస్తూ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. డిసెంబర్‌ 1వ తేదీన జరిగే పోలింగ్‌లో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ప్రియాంకరెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ కి ముంపు సమస్య తలెత్తినప్పుడు రానీ నాయకులు ఇప్పుడు ప్రచారం కోసం కేంద్రం నుంచి దిగుతూనే ఉన్నారన్నారు. సమస్యలో ఉన్నప్పుడు ఆదుకోని వాళ్లు ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజలను అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలుపొందేటా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌ సీహెచ్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్, మహ్మద్‌ అహ్మద్‌ అలీ, మహ్మద్‌ సర్వర్, అశ్వినిమార్గం, జనక్‌ గౌడ్, ప్రదీప్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: