హైదరాబాద్ నగరమంతా గ్రేటర్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రచారంలో దూకుడును పెంచారు. నాలుగు పార్టీలు ఇప్పుడు నువ్వా నేనా అంటూ గట్టి పోటీతో ముందుకు వెళ్తున్నారు. నిన్న మొన్నటి దాకా టీఆరెఎస్ , బీజేపి పార్టీలు మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చాయి. తాజాగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కూడా జోరును పెంచాయి. ఒకరిపై మరొకరు విమర్శలతో హోరెత్తిస్తున్నారు. కానీ, తెలంగాణ తెలుగు దేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బాలకృష్ణ వంటి వారు మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయాక జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లోనూ చంద్రబాబు టీడీపీ తరపున హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించేవారు



ఈ ఎన్నికల భారం మొత్తం తెలంగాణ టీడీపీ పార్టీ పైనే ఉందని తెలుస్తుంది.టీడీపీకి జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శులైన చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల ప్రచారంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవడం ఎక్కడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ విషయం పై పలు చర్చలు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ వంటి నాయకులు హైదరాబాద్‌లో పార్టీ తరపున ప్రచారంలో పాల్గొని ఉంటే క్యాడర్‌లో మంచి ఉత్సాహాన్ని కలిగించేది అని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి వచ్చిన ఓట్ల శాతం మరీ దారుణంగా ఉంటే అది ఏపీలో కచ్చితంగా టీడీపీ పతనానికి కారణం అవుతుందని అంటున్నారు. 



అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలపర్చేందుకు ఎలాంటి వ్యూహరచన చేయలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ బలోపేతానికి ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా ఏపీలో దాని ప్రభావం పార్టీపై నేరుగా పడుతుంది..ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పేరును పెంచడానికే తెలంగాణ లోని గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలుస్తుంది. ఈ విషయం పై ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. కాగా, టీడీపీ అ్యర్థులుగా ఇద్దరు మహిళలు పోటీలో నిలుస్తున్నారు. వారు సాధారణ మహిళలు కావడంతో మీడియా వారిని పదే పదే చూపిస్తుంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఎక్కడో మూల చిన్న ఆశ చిగురించింది. ఏమౌతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: