గ్రేటర్ ఎన్నికల సమరంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే రణరంగాన్ని తలపిస్తున్నాయి. అంకెలను వెనకనుండి ముందుకు లెక్కించినట్లుగా.... జాతీయ పార్టీ అయిన బీజేపీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల కోసం దిగి రావడం  సంచలనంగా మారింది. ఇక అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల ఎన్నికల జోరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా విభిన్నమైన ట్రెండ్తో ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం అధికార పార్టీకి మరియు జాతీయ పార్టీ అయిన బీజేపీ కి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ చావా.. రేవా.. అన్నట్లుగా ఉంది. ప్రజాసంక్షేమం అటుంచితే... ఎవరి రాజకీయ కారణాలు వారికున్నాయి.

 ఒకరిదేమో ప్రజలు ఇప్పటికీ మాపై నమ్మకం పెట్టుకుని ఉన్నారు అని నిరూపించాల్సిన పరిస్థితి... ఇంకొకరిదేమో ముఖద్వారాన్ని దాటు కుంటేనే సింహాసనాన్ని అధిష్ఠించగలం అన్న వ్యవహారం. మరోవైపు మా పార్టీ కూడా రేసులో ఉంది అని గుర్తు చేయాల్సిన పరిస్థితిని అధిరోహించాలనే పట్టుదల... ఇలా రకరకాల కారణాలతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారాలు ఓ రేంజ్ లో కొనసాగుతున్నాయి. మునుపెన్నడూ వినపడని విమర్శలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో గట్టి నమ్మకంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వాధినేత కేసిఆర్ ఎన్నికల్లో తమ పార్టీ నేతలను గెలిపించే బాధ్యతను ప్ర‌ధానంగా ఐదుగురు మంత్రుల‌కు అప్పగించినట్లు సమాచారం.

వీరిలో ముఖ్యంగా తనయుడు కేటీఆర్ ,త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, స‌బితా ఇంద్రారెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, నిరంజ‌న్ రెడ్డిల‌కు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన కీలక  బాధ్యతలను ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నమ్మకం నిలబెట్టుకునేందుకు గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం ఈ నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. నిజానికి ఆ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థుల్లో ఉండాల్సిన ఉత్సాహం దూకుడు కంటే వీరి తొందర ఎక్కువగా ఉంది అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఎంత కష్టపడుతున్నా వీరి శ్రమకు ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. గ్రేట‌ర్ ఫైట్ అవ‌గానే.... ఇందుకోసం కేసిఆర్ కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని టాక్. దీంతో అధికారంలో ఉన్నవారు తమ పీఠాలను దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు దుబ్బాక ఎన్నికల రిజల్ట్ కారణంగా మంత్రి హరీష్ రావు పై కేసీఆర్ ఇప్పటికి ఆగ్రహం గానే ఉన్నారట. ఇలా కేసిఆర్ మంత్రివర్గంలో వివిధ భావనలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: