ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వాడి వేడి గా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీజేపీ అధికార టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి కూడా ఈ రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతూ ఉండడమే కాదు అటు ఇరు పార్టీల ముఖ్యనేతలు కూడా ఒకరికి ఒకరు సవాల్ విసురు కుంటూ ఉండడం కూడా మరింత సంచలనంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు సంచలన విమర్శలు కూడా చేసుకుంటున్నారు అయితే ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలంగాణ రాజకీయాలను ఊపేసింది.



 ఒకవేళ తెలంగాణలో జరుగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపికి మేయర్ పీఠాన్ని కట్టబెడితే ఏకంగా పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బస్తీలో ఉన్న రోహింగ్యాలు పాకిస్తానీ లను సర్జికల్ స్ట్రైక్ చేసి తరిమికొడతాం అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై అటు ఎంఐఎం పార్టీ తో పాటు మరోవైపు టిఆర్ఎస్ పార్టీ కూడా ఘాటుగానే స్పందించింది. తాజాగా ఇదే విషయంపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ బండి సంజయ్ పై విమర్శలు గుప్పించారు.




 ఒకవేళ జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీకి మేయర్ పీఠం కట్టబెడితే వెంటనే పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారని.. పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ ఎందుకు అంటూ ప్రశ్నించారు. పాతబస్తీ ఏమైనా పాకిస్థాన్ లో ఉందా అంటూ ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. పాతబస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటూ వ్యాఖ్యానించిన బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ చేయాల్సింది పాతబస్తీ పై కాదు దమ్ముంటే పేదరికంపై సర్జికల్ చేయండి అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి: