దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం టీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహన్ని నింపాయి.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో వారి సత్తాను చాటేందుకు టీఆరెఎస్ నేతలు, కార్యకర్తలు ఎవరికీ వారే అన్నట్లు పార్టీ గెలుపు కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. రాత్రి , పగలు అని తేడా లేకుండా ఎక్కడికక్కడ రోడ్ షో లు , పలు కార్యక్రమాలతో పాటుగా ర్యాలీలు నిర్వహిస్తూ టీఆరెఎస్ పార్టీపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇకపోతే తాజాగా మంత్రి కేటీఆర్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌ షో లో పాల్గొన్నారు.. 



ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏం లేదని చెప్పారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామని మాయమాటలు చెప్పారని మండిపడ్డారు. గుజరాత్‌ రాష్ట్రంలో వరదలు వస్తే రూ.500 కోట్లు ఇచ్చారని.. మరి తెలంగాణలో వరదలు వస్తే ఏం ఇచ్చారని కేటీఆర్ ప్రశ్నించారు.ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందో అది చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయని యువత బయపడవద్దని మంత్రి కేటీఆర్‌ అన్నారు.



టీఆరెఎస్ పై బురద చల్లుతున్న బీజేపి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు ఢోకా లేదు. హైదరాబాద్‌ ప్రజలు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఆకలైతే రూ.5కే భోజనం పెట్టే అన్నపూర్ణ ఉంది. సుస్తి చేస్తే బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఆడపిల్లకి పెళ్లి చేస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌.. ఇలా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చేసేవి చెప్పాలంటే గంటల సమయం పడుతుంది.ఆరేళ్లలో మనం పన్నుల ద్వారా కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు కడితే, తిరిగి రాష్ట్రానికి రూ.1.40లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. సొమ్ము మనది.. సోకు దిల్లీది. ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మైండ్ కరాబ్ చేసుకోకుండా సరైన నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మీపైనే ఉంది అని కేటీఆర్ వివరించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: