పెన్షన్ దారులకు కేంద్రం లోని నరేంద్ర మోదీ బీజేపి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెన్షన్ తీసుకునే వారికి ఊరట కలిగే విషయమే... లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు గడువును పొడిగించింది. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది. దీంతో పెన్షన్ తీసుకునేవారికి ఊరట కలుగనుంది. జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించడానికి ఎక్కువ గడువు అందుబాటులోకి వచ్చింది. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వారు కచ్చితంగా నవంబర్ నెలలో లైఫ్ సర్టిఫికెట్ అందించాల్సి ఉంటుంది అని మొదట తెలిపారు. అయితే ఈసారి గడువు పొడిగించారు. మోదీ సర్కార్ తాజా నిర్ణయంతో పెన్షనర్లు ఇకపై లైఫ్ సర్టిఫికెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోగా సమర్పించొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇలా గడువును పొడిగించడం ఇది రెండో సారి కావడం గమనార్హం. ఇది వరకు నరేంద్ర మోదీ సర్కార్ డెడ్‌లైన్‌ను నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31కి పొడిగించింది. ఇప్పుడు మరలా ఈ డెడ్‌లైన్‌ను మరొక రెండు నెలలు అంటే 2021 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.


కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునేవారు ఇకపై వారి లైఫ్ సర్టిఫికెట్‌ను ఫిబ్రవరి నెల చివరి లోపు అందిస్తే సరిపోతుంది. దీంతో పెన్షనర్లు వారి పెన్షన్ సర్టిఫికెట్ ఇవ్వకపోయినా కూడా ఫిబ్రవరి 28 వరకు నిరంతరాయంగా పెన్షన్ పొందొచ్చు. దీని కోసం పెన్షనర్లు, పెన్షనర్స్ అసోసియేషన్స్ నుంచి చాలా వినతులు వచ్చాయని, అందుకే లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పణ గడువును పొడిగిస్తున్నామని కేంద్ర బీజేపి ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక అలాగే పెన్షనర్లు.. వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం పాటిస్తూ బ్యాంక్‌కు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ అందించొచ్చని పేర్కొంది. అలాగే ఇక లైఫ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో కూడా సమర్పించొచ్చు అని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: