గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీ కాస్త జోరును పెంచింది.. బీజేపి ఆగడాలను ఎక్కడా సాగనివ్వకుండా ముందుకు సాగుతుంది.. హైదరాబాద్ లోని పలు నగరాల్లో రోడ్ షో లు చేస్తూ నేతలు తెగ బిజీగా ఉన్నారు.ఒక్కో ఎమ్మెల్యే కు ఒక్కో నియోజకవర్గాన్ని అప్పగించి ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకొనే దిశగా చర్యలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావు.. తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ప్రజలను టీఆరెఎస్ కు ఓట్లు వేసేలా చూస్తున్నారు. గత ఆరేళ్లుగా అధికార ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. 



ఈ మేరకు మంత్రి హరీష్ రావు.. భారతి నగర్, సులేమాన్ నగర్, అత్తాపూర్, రాజేంద్ర నగర్, పఠాన్ చెరువు ప్రాంతాల్లో పర్యటిస్తూ రోడ్ షో లు నిర్వహిస్తూ అభ్యర్థులకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. తాజాగా నగరంలోని భారతీనగర్‌ డివిజన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు నల్లా బిల్లులు కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వల్ల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇళ్లు లేని పేదలకు త్వరలోనే రెండు పడకగదుల ఇళ్లను అందిస్తామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.


 
రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఎక్కడా లేవని చెప్పారు. ఇప్పటివరకు ఎవరికైతే వరద సాయం అందలేదో వారికి ఎన్నికల తర్వాత వరద సాయం అందిస్తామని స్పష్టం చేశారు.వరద సాయం అందని ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రశాంత కావాలని అనుకునేవారు ఖచ్చితంగా తెరాసకు ఓటు వేయాలని అన్నారు. తెరాసతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అని హరీశ్‌రావు స్పష్టం చేశారు.బీహెచ్‌ఈఎల్‌ సంస్థకు రూ.40 వేల కోట్ల ఆర్డర్‌ ఇచ్చింది సీఎం కేసీఆర్‌. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడే బాధ్యత కేసీఆర్‌ తీసుకుంటున్నారు.  ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయని మరోసారి గుర్తు చేశారు.ఉస్మాన్‌సాగర్‌లో ఐటీ పార్క్‌, సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైస్‌ పార్క్‌ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రాష్ట్ర అభివృద్ధిని చూసే హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయి. నగరంలో శాంతి భద్రతల సమస్యలు ఉంటే పెట్టుబడులు ఎందుకు వస్తాయి?కరోనా, భారీ వరదల సమయంలో ప్రజలకు తెరాస అండగా ఉండి ఆదుకుందని హరీశ్‌రావు చెప్పారు. ప్రజల సపోర్ట్ ఉంటే రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: