ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ప్రచారం ఊపందుకుంది అనే విషయం తెలిసిందే. ఇక ప్రచార గడువు మరో రెండు మూడు రోజుల్లో ముగియనున్న  నేపథ్యంలో ఇక ఉన్న కొంత సమయాన్ని కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఎక్కడ చూసినా కూడా ప్రచార హోరు కనిపిస్తుంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ భారీ ర్యాలీలు నిర్వహిస్తూ.. రోడ్ షో లు చేస్తూ ఇంటింటి ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.



 ఈ క్రమంలోనే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గం లోని అల్వాల్ సర్కిల్ కు ప్రధాన పార్టీల ప్రచారం తారా స్థాయికి చేరిపోయింది. నియోజకవర్గంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో వివిధ డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు.. ప్రస్తుతం తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. అయితే ప్రత్యర్థుల కంటే భిన్నంగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం ఆయా డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు కూడా కొనసాగుతున్నాయి.

.

 కాగా ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గం లోని అన్ని డివిజన్లలో కూడా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ఈ క్రమంలోనే మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఏ  డివిజన్లో చూసినా కూడా డివిజన్ లో పోటీ చేస్తున్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచార హోరు తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ  క్రమంలోనే ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గం లో వాతావరణం హాట్ హాట్ గా  మారిపోయింది. ఇక మల్కాజిగిరి నియోజకవర్గం లో అభ్యర్థులు ఓటర్లను ఎంత వరకు ఆకట్టుకున్నారు అనేది డిసెంబర్ 1న ఓటర్లు తేల్చనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: