మల్కాజిగిరి నియోజకవర్గం పరిధి లో ప్రస్తుతం రాజకీయాలు వాడివేడిగా మారి పోయాయి.  ముఖ్యంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకం గా తీసుకోవడం తో ప్రస్తుతం అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రచారం మొదలుపెట్టారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికల ను ప్రతిష్టాత్మకం గా తీసుకోవడం తో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎంతగానో ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇక ప్రచారానికి కొంత సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో... కొంత సమయాన్ని కూడా పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటున్నారు.


 ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఏ డివిజన్లో చూసినా ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న ఘటనలే తారసపడుతున్నాయి. ఇక ఇటీవలే మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ డివిజన్లో తెరాస అభ్యర్థి విజయశాంతి ఇంటింటి ప్రచారం నిర్వహించి టిఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. డివిజన్లో గత ఐదు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి చూసి ప్రజలందరూ తమకు ఓటు వేసి గెలిపించాలని అంటూ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.


 ఈ క్రమంలోనే అల్వాల్ డివిజన్లోని పలు కాలనీలలో కలియతిరిగిన టిఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. అయితే డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యలను తీరుస్తామని.. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటాను  అంటూ ప్రజలందరికీ హామీ ఇచ్చారు అల్వాల్ టిఆర్ఎస్ అభ్యర్థి విజయశాంతి. అయితే ఇతర పార్టీలతో అసలు తనకు పోటీ  లేదని.. డివిజన్ లోని ప్రజలందరూ తన వైపు వున్నారు అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామూ  అంటూ ధీమా వ్యక్తం చేశారు అల్వాల్ డివిజన్ అభ్యర్థి విజయశాంతి.

మరింత సమాచారం తెలుసుకోండి: