గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ప్రచారానికి ఇంకా రెండు మూడు రోజులు సమయం ఉండటంతో ప్రత్యర్థి పార్టీలతో మినీ యుద్ధమే చేస్తున్నాయి పార్టీలు. అయితే ప్రతిపక్షాలు అన్నిటికీ మెయిన్ టార్గెట్ గా కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ గా ఉంది. అన్ని పార్టీలు ముఖ్యంగా టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న విజయశాంతి కొద్దిరోజులు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయాన్ని ఆమె ఖండించక పోయినా బీజేపీ నేతలు పాడుతున్న పాట నే ఆమె కూడా పాడుతూ ఉండడంతో ఆమె పార్టీ మారడం ఖాయం అంటున్నారు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఆమె కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.


జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడు తట్టుకోలేక కెసిఆర్ బెంబేలెత్తుతున్నారు అని ఆమె ఆరోపించారు. ఎంఐఎం తో కలిసి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పించే కుట్ర పన్నుతున్నారని అనుమానాలు బలపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే ఎంఐఎం నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఆ విషయం మీద కిమ్మనకుండా ఉండి పోతున్నారని ఆమె ఆరోపించారు. కానీ ఎంఐఎం దౌర్జన్యాన్ని ఆ పార్టీ చేస్తున్న ప్రసంగాలు గురించి ప్రస్తావిస్తున్న పార్టీలను మాత్రం కట్టడి చేయడానికి పోలీసు బలగాల ప్రయోగించడానికి దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారని వార్తలు వస్తున్నాయని ఆమె అన్నారు. 


ఇన్ని రోజులు ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు హైజాక్ చేసేవారని లేకపోతే గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభ పెట్టి భయపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కెసిఆర్ కి ముందు నుంచి మంచి అలవాటు ఉందని ఆమె అన్నారు. కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి వచ్చి ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించే కొత్త ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతోందని ఆమె అన్నారు. ఈ కుట్రలకు గనుక పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోరని ఇలాంటి విషయాలను తెలంగాణ సమాజం సహించదని, క్షమించదని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: