మజ్లిస్ పార్టీ రూటే సెపరేట్ అన్నట్లు ఇప్పటి వరకు గ్రేటర్ ఎన్నికల కోసం తమ పార్టీ యొక్క మేనిఫెస్టో ని ఇంకా ప్రకటించలేదు ..అయితే మజ్లిస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించక పోవడానికి కారణాలని తెలుపకముందు  గమనిస్తే ..మజ్లిస్  పార్టీ ఎన్నడూ ఎన్నికల మేనిఫెస్టోని ని ప్రకటించనేలేదట.. అయినా కూడా ప్రజలు పార్టీ పై ఉన్న నమ్మకంతో ఓట్లు వేసేవారట ఆలా  ఎన్నికల మేనిఫెస్టో ని ప్రకటించకుండానే ఎన్నికల్లో నిలబడి గెలిచినా  ఏకైక పార్టీ మజ్లిస్ పార్టీ ..  ఈ సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక మోసం అని  మజ్లిస్  పార్టీ అభివర్ణించింది .. మేము ఎన్నికల ఓట్ల కోసం బుజ్జగింపులు చేయమని మా పార్టీ పనితీరు మాకు కొండంత బలం అని  అంటోంది ..

ఎన్నికలప్పుడు ఎప్పుడు చేసే విదంగా ఈ గ్రేటర్ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేయలేదు ..అందుకు గల కారణం ఏమిటంటే మజ్లిస్  పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదట .. అందుకే మేనిఫెస్టోని ప్రకటించకపోవడం విశేషం .. ఎన్నికల వేళా మజ్లిస్ పార్టీ విభిన్నంగా వ్యవహరిస్తోంది .. మేనిఫెస్టోని ప్రకటించకుండానే ముందుకు వెళ్తుంది .. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారాలను చేస్తోంది ..

అంతేకాకుండా ఎన్నికల వేళా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తోంది ..మజ్లిస్ అధినేతలు తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరుస్తున్నారు ..  పార్టీ పని తీరునే ఆధారంగా చేసుకొని ఎన్నికల బరిలోకి దిగనుంది మజ్లీస్ పార్టీ .. దీనివల్ల అభ్యర్థులకు విజయం లభిస్తుందని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది .. అభ్యర్థుల ఎంపికలో కూడా మజ్లీస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది ..

ఈ సారి మజ్లిస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేయడం విశేషం .. కేవలం 51  డివిజన్లకు మాత్రమే పోటీ చేయనుంది .. గత గ్రేటర్ ఎన్నికలో మజ్లీస్ పార్టీ 61  డివిజన్లకు పోటీ చేసి అందులో 44  స్థానాలను దక్కించుకుంది ..


మరింత సమాచారం తెలుసుకోండి: