ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య నెలకొంది. అయితే కాంగ్రెస్ కూడా తానేమీ తక్కువ తినలేదు అన్నట్టు ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులు దింపి ఎలా అయినా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్టే రేవంత్ రెడ్డి లాంటి నేతలు ప్రచారంలో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున కొంతమంది అభ్యర్థులను బరిలోకి దింపినా పార్టీ తరఫున ఎవరు ప్రచారంలో పాల్గొనడం లేదు.



దానికి కారణాలు ఏమైనా గానీ జూబ్లీహిల్స్ డివిజన్ తెలుగుదేశం తరఫున పోటీకి దిగిన తెలుగుదేశం అభ్యర్థి మామిడి నరసింహులు చర్చనీయాంశంగా మారారు దానికి కారణం ఆయన కోటీశ్వరుడు కాదు లక్షాధికారీ కాదు కేవలం ఒక సామాన్య కార్యకర్త. అంతకు మించి ఆయన చేసే పని తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. పార్టీలో పదవులు పొంది కోట్లాది రూపాయలు సంపాదించి తమ స్థాయికి మించి పదవులు పొందిన నేతలు సైతం పార్టీ కష్టకాలంలో ఉంటే తమ దారి తాము చూసుకున్న వైనం ఇప్పటి దాకా చూశాం. కానీ ఈ కార్యకర్త పార్టీకి అంకితభావంతో పని చేస్తూ టిడిపిలో పెద్దపెద్ద నేతలు సైతం సిగ్గుపడేలా చేశాడని చెప్పక తప్పదు. 



చేతిలో లక్షలు లేకపోయినా ప్రచారం కోసం ఖర్చు పెట్టే దమ్ము లేకపోయినా పార్టీ పరువు పోకూడదు అని చంద్రబాబు సొంత డివిజన్లో ఆయన పోటీకి దిగారు. మరి ఎవరైనా ఇంత ధైర్యం ఎందుకు చేశారు అని అడిగితే, తాను రోజు ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తానని జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లో చాలా ఇళ్ళ వాళ్లు నాకు తెలుసు, వాళ్ళందరూ తనకు ఓటు వేస్తామని హామీ ఇచ్చారని అని ధైర్యంగా చెబుతున్నాడు. ఒక సామాన్య వ్యక్తి చంద్రబాబు సొంత డివిజన్లో పార్టీ అండదండలు లేకపోయినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: