ప్రస్తుతం దేశం లోని ప్రముఖ రాజకీయ నాయకులంతా హైదరాబాద్ లో జరగనున్న గ్రేటర్ ఎన్నికలపైనే గురి పెట్టారు. ఎందుకో తెలియదు ఈ సారి గ్రేటర్ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. రాత్రికి రాత్రే నాయకులు మారిపోతున్నారు. ఎలాగైనా మేయర్ పదవిని చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తుంటే, మరో వైపు తెరాస నాయకులు ఈ సారి 100 కార్పొరేటర్ స్థానాలను గెలిచి సెంచరీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలోని అన్ని పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు.. ఇటువంటి సందర్భంలో మాట్లాడే ప్రతి మాట కూడా ఎంతో ముఖ్యమైంది. ఒక్క చిన్న మాట తూలినా అది ప్రత్యర్థికి  ఆయుధంగా మారొచ్చు.

ఇలాంటి తప్పే ఇప్పుడు ఒకటి జరిగింది. ఇటువంటి కీలక సమయంలో మజ్లీస్ పార్టీ అధినేత తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ అనుకోని వ్యాఖ్యలు చేయడంతో, గ్రేటర్ ఎన్నికల వేల అది సంచలనముగా మారింది. ఇదే అదునుగా భావించిన బీజేపీ ఈ వ్యాఖ్యలను ఓ రేంజులో వాడుకుంటోందని చెప్పొచ్చు. ప్రత్యర్థుల తప్పుల కోసం ఎదురుచూస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మాటలను రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించుకోనున్నారు. ఇంతకీ అక్బరుద్దీన్ ఏమన్నారంటే, హుస్సేన్ సాగర్ విస్తీర్ణం బాగా తగ్గిపోయిందని ఆ ప్రాంతంలోనే ఎన్టీఆర్ ఘాట్ మరియు పీవీ ఘాట్ లను ప్రతిష్టించారని, వెంటనే వాటిని కూల్చి వేయాలని అన్నాడు.

దీనికి బండి సంజయ్ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ ఘాట్ మరియు పీవీ ఘాట్ ల దగ్గరకు వెళ్లి వారి ఫోటోలను పూలమాలలతో సత్కరించి, మన రాష్ట్రానికి మరియు దేశానికి ఎంతో గొప్ప పేరును తీసుకువచ్చిన వీరి విగ్రహాలను ఎలా కూల్చమంటారని మజ్లీస్ పార్టీ పై ధ్వజమెత్తారు. మరణించిన వారిపై మీ ప్రతాపమా అంటూ వారి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు బట్టారు. తద్వారా ఎన్టీఆర్ మరియు పీవీ గార్ల అభిమానులకు మరింత చేరువయ్యేలా మాట్లాడారు. ఇది బీజేపీ కి ఎంతవరకు మేలు చేస్తుందో తెలియదు కానీ మజ్లీస్ పార్టీ కి మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: