గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు దగ్గరికి వచ్చే కొద్దీ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బిజెపి ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను తమ పార్టీలోకి చేర్చుకుని పనిలో పడిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని భావిస్తూ వచ్చిన కీలక నేతలకు గాలం వేసి తమ పార్టీలో చేర్చుకుంటూ పోతోంది. తాజాగా టిఆర్ఎస్ తరఫున శాసన మండలి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతానికి రాజకీయ నిరుద్యోగిగా ఉన్న స్వామి గౌడ్ ని బీజేపీ తమ పార్టీలో చేర్చుకోవడం సఫలమైంది. 



ఆయన మొన్ననే నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. వెంటనే హైదరాబాద్ వచ్చి ఆయన కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే పాల్గొన్నారు కానీ ఇప్పుడు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అదేంటంటే కెసిఆర్ ని తండ్రిలాగా భావించానని కానీ ఆయన మాత్రం చెప్పుడు మాటలు విని తన దూరం పెట్టారు అని చెప్పుకొచ్చాడు. అలాగే కెసిఆర్ తనకు ఎంతో చేశారు అని జనాలు అంటున్నారని కానీ తనను ఏమి రోడ్డుమీద ఉంటె తెచ్చి పదవి ఇవ్వలేదని గుర్తు పెట్టుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. 



ఒక టిఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న తనకు ఆ రోజుల్లో ఉద్యమం చేశాను కాబట్టే కెసిఆర్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అయితే తర్వాతి రోజుల్లో కెసిఆర్ తనను చాలా అవమానించారని ఒక్కసారి కలవాలని కోరినా రెండేళ్ల పాటు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తనను ఇబ్బంది పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఏకంగా తనను పోలీసులు రెండు సార్లు చంపడానికి ప్రయత్నించారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మరి పోలీసులు చంపడానికి చూస్తే ఆయన అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అనేది ఆసక్తికరంగా మారింది. కేవలం ఇప్పుడు బీజేపీకి సానుభూతి ఓట్లు పడే పడేలా చేయడం కోసమే ఆయన అలా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్గాలు వాదిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: