గ్రేటర్ ఎన్నికల సమరం నడుస్తుంది ..ఎన్నికలు అంటే ప్రచారాలు , ర్యాలీలు ,బహిరంగ సభలు అనేవి జరుగుతుంటూ ఉంటాయి .. అయితే ఇలాంటి జరిగేటప్పుడు కొన్ని అవాంఛనీయ ఘటనలు ఏర్పడటం సహజం .. మాములుగా ఒక రాజకీయ పార్టీ సభ జరిగినపుడు పోలీసులు సభ ప్రారంభం నుండి పూర్తిఅయ్యేవరకు బందోబస్తుని ఏర్పాటు చేస్తారు .. ఎల్లపుడు సభ ప్రాంగణాన్ని మరియు సభ చుట్టుపక్కల పరిసరాలని పర్యవేక్షిస్తూ ఉంటారు ... సభ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా చూసే బాధ్యత పోలీసులదే ..

ఇప్పుడు నగరం  లో గ్రేటర్ పర్వం నడుస్తుంది .. డిసెంబర్ లో జరిగే మున్సిపల్ ఎన్నికల  కోసం అన్ని పార్టీలు విసృతంగా ప్రచారాలు ప్రారంభించారు .. ఒకరి పార్టీ  పై ఒకరు మాట మాట అనుకుంటున్నారు .. ఈ గ్రేటర్ ఎన్నికల్లో మా పార్టీ యే అధికారాం లోకి వస్తుందని బీజేపీ పార్టీ అంటే  ..ఆ మాటని తెరాస పార్టీ ఖండిస్తోంది .. ఇలా మాట మాట విమర్శలు పెరుగుతున్న సందర్భంలో చిన్న చిన్న గొడవలు, ఉద్రిక్త పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది .. ఈ లాంటి పరిస్థితుల నడుమ హైదరాబాద్ పోలీసులు గ్రేటర్ ఎన్నికల కోసం  భద్రతని ని రెట్టింపు చేస్తున్నారు ..  

ఈ గ్రేటర్ ఎన్నికల కోసం మూడో  కన్నుని కూడా వాడుతున్నారు. సుమారు 15  వేలకి పైగా సీసీటీవీ లను ఉపయోగించబోతున్నట్లు తెలుస్తుంది .. ఎక్కడ ఏమి జరిగిన సీసీటీవీ లో వీడియోని చూసి స్థానిక పోలీసులకి తెలియజేసేలా పొలిసు సిబ్బంది పనిచేస్తోంది .. 24  గంటల పాటు 50 మంది పోలీసులు ఇందులో పనిచేయనున్నారు .. గొడవలు ఎక్కువ జరిగే ప్రాతాల మొదలు  గొడవలు తక్కువ జరిగే ప్రాంతాలపై మూడో కన్ను (సీసీటీవీ ) ఉపయోగించి  ప్రత్యేక నిఘా చేపెట్టనున్నారు ..  

మరింత సమాచారం తెలుసుకోండి: