న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఇటీవల కాలుష్యం ప్రభావం మరింత పెరగడంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతోంది. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంటలను తగులబెట్టడం వల్ల ఆ పొగ మొత్తం ఢిల్లీని ఆవరించేసింది. దీంతో ఢిల్లీ నగరంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది.

దీనికి తోడు ఇటీవల దీపావళి నాడు ప్రజలు కాల్చిన బాణసంచా వల్ల కాలుష్యం పతాకస్థాయికి చేరిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కేంద్ర వాతావరణ శాఖ సైతం ఇదే విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం
గరిష్టంగా 400 పాయింట్లకు, అత్యల్పంగా 300 పాయింట్లకు చేరినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం తెలుస్తోంది.

గాలిలో కాలుష్యం స్థాయిని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తెలియజేస్తుంది. వాయు కాలుష్యం 201-300 మధ్య ఉంటే ‘పూర్’గా ఉన్నట్లు.. 301-400 మధ్య వాయు కాలుష్యం ఉంటే ‘వెరీ పూర్’ ఉన్నట్లు. ఢిల్లీలో వాయు కాలుష్యం ‘వెరీ పూర్’ గరిష్ట మార్క్‌ను చేరుకుంది. ఇది కూడా దాటితే ‘సివియర్’స్థాయికి చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీలో కాలుష్యం ఈ మార్కును కూడా చేరుకుంటే అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

ఈ విషయాన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కచ్చితంగా చెబుతోంది. ఒకవేళ ఢిల్లీలో కాలుష్యం సివియర్ స్థాయికి చేరుకుంటే ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెంటనే ప్రభుత్వాలు సరైన చర్యలు
తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే వాయు కాలుష్యాన్ని అదుపు చేయడంలో అధికార యంత్రాంగం పనితీరుపై ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: