గ్రేటర్ ఎన్నికల వేల తెరాస ప్రభుత్వం తమ ప్రచార పనుల్ని వేగవంతం చేసింది .. మరో మూడురోజుల్లో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియడంతో తెరాస ప్రభుత్వం ప్రచార ఉదృతిని పెంచింది .. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ వెలువడగానే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించిన తెరాస  పార్టీ నామినేషన్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించింది .. ఈనెల 20 వ తేదీనుంచి రోడ్ షోలను కూడా ప్రారంభించింది .. తెరాస పార్టీ నుండి కేటీఆర్ ప్రచారంలో పాల్గొంటున్నారు .. కేవలం సాయంత్రం వేళలో కేటీఆర్ రోడ్ షోలలో పాల్గొంటూ మిగతా సమయం లో వివిధ వర్గాల వారి తో సమావేశం జరిపి పార్టీ ఎజెండా ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నం చేస్తున్నారు ..

ఈనెల 29  న ప్రచారం ముగియడం తో జిల్లాలోని ప్రముఖులందరిని తెరాస పార్టీ  హైదరాబాద్ కి రప్పిస్తుంది .. పార్టీ కి చెందిన ఎమ్యెల్యే మరియు ఎమ్యెల్సీ లను డివిజన్లకు ఇంచార్జి లుగా చేసి వాడవాడలా ఇంటింటికి వెళ్లి ప్రచారాలను ముమ్మరం చేస్తోంది .. డివిజన్లలో జరుగుతున్నా ప్రచార కార్యక్రమాలను ఇంచార్జిలు  ఎప్పటికప్పుడు సీఎం కెసిఆర్ కి చేరవేస్తున్నారు .. అంతే కాదు  సీఎం గారి  ఆదేశాలు మరియు సూచనలను కూడా అందుకొని ప్రచారాలను ఇంకాస్త మెరుగ్గా చేయడం పై దృష్ట్టి పెడుతున్నారు ..

ఒక వైపు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే  మరోవైపు ప్రసార మాధ్యమాలలో తెరాస  పార్టీ తమ  అజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లేలా దృష్టి పెడుతుంది .. మరోవైపు  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కూడా అనేక టీవీ చానెల్స్ కి ఇంటర్ వ్యూస్ ఇస్తూ గడిచిన ఆరేళ్లలో పార్టీ సాధించిన విషయాలపై ప్రస్తావిస్తున్నారు . సోషల్ మీడియా ని కూడా గ్రేటర్ ఎన్నికల కోసం తెరాస పార్టీ వినియోగిస్తుంది .. సోషల్ మీడియా  లో ఎప్పటికప్పుడు పోస్టులను  పెడుతూ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ కోరుతుంది ..

గ్రేటర్ ఎన్నికల సందర్గంగా ఈ నెల 28  న ముఖ్యమంత్రి బహిరంగ సభను నిర్వహించనున్నారు ..ఈ సభ జనసమీకరణపై పార్టీ దృష్టి పెట్టింది .. ఈ బహిరంగ సభని ఎల్బీ స్టేడియం లో నిర్వహించనున్నారు .. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి  దూరంగా ఉన్న సీఎం కెసిఆర్ ..ఒక్క పార్టీ మేనిఫెస్టో విడుదలలో మాత్రమే పాల్గొన్నారు ..  సీఎం కెసిఆర్ అన్ని పార్టీలకి తమ పార్టీ పై వచ్చిన విమర్శలకి గట్టి జవాబు ఇచ్చేలా ఈ సభ ద్వారా ఉంటుందని తెరాస వర్గాలు అంటున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: