తెరాస నేతల ప్రచారాలు, రోడ్ షో లు తారాస్థాయికి చేరుతున్నాయి.. ఎవరికీ వారే అన్నట్లు అన్నీ పార్టీలు పోటీ పడి మరీ ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇకపోతే తెలంగాణలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పోలీసులు నిఘా పెట్టారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇకపోతే ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో విజయం కోసం బీజేపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వారి దూకుడుకు చెక్ పెడుతూ  తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు..

మ్యానిఫెస్టోను కూడా బీజేపీ అరువు తెచ్చుకున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ నగరానికి ప్యాకేజీ అంటూ మరోసారి ప్రజల చెవుల్లో పూలు పెట్టిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లుగా చేసిన అభివృద్ధినే జీహెచ్‌ఎంసీలో అధికారంలోకి వస్తే చేస్తామని బీజేపీ పేర్కొనడం ఆ పార్టీ సిగ్గుమాలినతనానికి నిదర్శనమన్నారు.

సొంతంగా మ్యానిఫెస్టో  కూడా రూపొందించుకొని పార్టీ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తారు అంటూ ప్రశ్నించారు.బీజేపీకి ఓటేస్తే కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇస్తామంటూ బీజేపీ చేసిన హామీపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కరోనా సమయంలో వలస కార్మికుల నుంచి రైల్వే చార్జీలు వసూలుచేసిన ఘనత బీజేపీదేనని.. రేపు ఎన్నికల తర్వాత కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలుచేసే పార్టీ కూడా అని అన్నారు. బీజేపి చేతకాని పనులను చేస్తామని చెబుతుంది.. ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రజలు గమనించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: