న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బెయిల్ గడువును సుప్రీం పొడిగించింది. మరో నాలుగు వారాల పాటు బెయిల్ ఇస్తున్నట్లు శుక్రవారం తీర్పునిచ్చింది. 2018లో జరిగిన తల్లీ కొడుకుల ఆత్మహత్య నేపథ్యంలో ముంబై పోలీసులు అర్ణబ్‌పై కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో అర్ణబ్ సుప్రీంను ఆశ్రయించారు. కేసు విచారించిన అత్యున్నత ధర్మాసనం అర్ణబ్‌కు ఈ నెల 11న తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.


 అప్పటికే ఆయన వారం రోజులుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. 
సుప్రీం బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చిన ఆయన మళ్లీ విధులు ప్రారంభించారు. అయితే నేటితో ఆ బెయిల్ గడువు ముగియనుండడంతో తిరిగి గడువును పొడిగిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.


ఇదిలా ఉంటే ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా అర్ణబ్ ప్రోత్సహించారంటూ ఆయనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే అరెస్టు కూడా చేశారు. అయితే ఈ కేసుపై అర్ణబ్ సుప్రీంలో సవాల్ విసిరారు.
దీంతో విచారణ చేపట్టిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన ధర్మాసనం అర్ణబ్‌కు అనుకూలంగా మాట్లాడింది.
అర్కిటెక్చర్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునే విధంగా అర్ణబ్ప్రోత్సహించినట్లు
 చెప్పలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 


అర్నాబ్గోస్వామిపై ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని, ఎఫ్ఐఆర్‌,
ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరానికి ఉండవలసిన అంశాల మధ్య సంబంధం లేదని చెప్పారు.


ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు తీర్పును కూడా సుప్రీం ధర్మాసనం విమర్శించింది. బాంబే హైకోర్టు ఈ కేసుపై ప్రాథమికంగా
 విలువకట్టినప్పటికీ, ఎఫ్ఐఆర్, ఐపీసీ 306 మధ్య సంబంధం లేదన్న విషయాన్ని గ్రహించలేకపోయిందని ధర్మాసనం పేర్కొంది. తన అధికారాన్ని వినియోగించడంలో విఫలమైందన్నారు.


 రాజ్యాంగ విలువలను, ప్రాథమిక హక్కులను రక్షించడంలో
హైకోర్టు  తన పాత్రను మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.


‘‘వివిధ అంశాలలో తన అభిప్రాయాల కారణంగా 2020 ఏప్రిల్ నుంచి తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని అర్నాబ్ గోస్వామి చెప్పారు. అయితే ఇక్కడ, రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కుల రక్షకురాలి పాత్రను హైకోర్టు పరిత్యజించింది. ఎంపిక చేసుకుని వేధించే సాధనంగా  క్రిమినల్ చట్టం ప్రజల విషయంలో మారకూడదు’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: