గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కాదు కానీ జనం తీర్పు కంటే ముందే నేతలు, పార్టీల జాతకాలు మారిపోతున్నాయి. ఈసారి ఎన్నికల విషయంలో బీజేపీ యమ సీరియస్ గా ఉండడమే కాదు, మొత్తానికి మొత్తం జాతీయ పార్టీ హైదరాబాద్ లో లాండ్ అయిపోయింది. ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారత్ బయోటిక్స్ సంస్థను సందర్శించాలని పనిపెట్టుకుని మరీ రావడం అంటే దాని వెనక కూడా గ్రేటర్ రాజకీయం ఉందని అంటున్నారు.

సరే ఇవన్నీ ఇలా ఉంటే ఆది కి ముందే గ్రేటర్ లో తన పార్టీ క్యాండిడేట్స్ ని పోటీకి పెడతాను అను చెప్పిన పవన్ కళ్యాణ్  ఆ తరువాత బీజేపీ పొత్తుతో వెనక్కి తగ్గిన సంగతి విధితమే. మరి పవన్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని అంతా భావించారు. కానీ పవన్ వైపు నుంచి కానీ బీజేపీ వైపు నుంచి కానీ అటువంటి సిగ్నల్స్ ఏవీ రాలేదు.

ఇపుడు చూస్తే బీజేపీకి అసలైన పెద్ద దిక్కు అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ వస్తున్నారుట.  ఆయన వచ్చిన తరువాత బీజేపీ ప్రచారం పూర్తిగా మారుతుందని అంటున్నారు. అమిత్ షా ప్రచారంతో గ్రేటర్ ఎన్నికల వేడిని పీక్స్ కి తీసుకెళ్ళాలని బీజేపీ ప్లాన్ వేస్తోంది. ఇక అమిత్ షా హైదరాబాద్ టూర్ లో ఆయన వెంట బీజేపీ నేతలు కనిపిస్తారనడంతో రెండో మాట లేదు.

మరి మిత్ర పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షా తో వేదిక పంచుకుని జనాలకు గ్రేటర్ ఎన్నికల్లో ఓటేయమని చెబుతారా అన్నది ఇపుడు చర్చగా ఉంది. రేపటితో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. మరి చివరి నిముషంలో అయినా పవన్ మెరుస్తారని అంటున్నారు. అది కూడా అమిత్ షా టూర్ లో మిత్రపక్షంగా పవన్ పాల్గొంటారు అంటున్నారు. మరి జనసేనాని ఆ విధంగా కనిపిస్తారా అన్నది చూడాలి. అది కనుక జరగకపోతే పవన్ ప్రచారం లేకుండానే గ్రేటర్ ఎన్నికలు కధ ముగిసిందనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: