జగన్ అధికారంలో వచ్చిన తరువాత తీసుకున్న సంచలన నిర్ణయం అమరావతి ని కాదని  విశాఖ ను రాజధాని గా చేయడం.. ఈ విషయం పై జగన్ కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. అయితే వాటిని అయన పట్టించుకోలేదు. తన దూకుడు స్వభావం తో నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోలేదు. ఫలితంగా రాజధాని ఈపాటు జరుగుతుంది.. అయితే గిట్టని కొన్ని ప్రతిపక్షాలు ఈ కేసును కోర్టు కి తీసుకెళ్లారు.. ప్రస్తుతం దీని తీర్పు పెండింగ్ లో ఉంది.. త్వరలోనే తీర్పు రానుంది..

అన్ని హంగులు ఉన్నా విశాఖ ను ఎందుకు రాజధాని గా వద్దంటున్నారో అర్థం కావట్లేదు అంటున్నారు వైసీపీ నాయకులూ. రాజధాని ని విశాఖ కు మార్చడానికి జగన్ ఎన్ని కారణాలు చెప్పినా ఒకటి మాత్రం నిజం అనిపిస్తుంది.. పర్యాటక కేంద్రం పరంగా విశాఖ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మచ్చు తునక అన్న విషయం అందరికి తెలిసిందే.. రాష్ట్రంలో ఎక్కువగా పర్యాటకులు విశాఖ కే వస్తుంటారు.. ఏ పర్యాటక కేంద్రానికి తోడు రాజధాని కూడా ఇక్కడే ఉంటే విశాఖ దేశ స్థాయిలో గుర్తింపు పొందడంతో పారు రాష్ట్రానికి మంచి ఆదాయం వస్తుందనేది ఆయన ఆలోచన గా మనకు అర్థమైపోతుంది.. అయితే అందుకు తగ్గట్లే జగన్ ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అడుగులేస్తున్నారు అని తెలుస్తుంది..

 ఇపుడు ప్రగతి సొబగులను అద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతీ సమీక్షా సమావేశంలోనూ విశాఖ అభివృద్ధి  కార్యాచరణను ముందుకు తెచ్చి ప్రస్తావిస్తూ అధికార యంత్రాంగాన్ని అలెర్ట్ చేస్తున్నారు.విశాఖకు తాగు సాగు నీరు కోసం పోలవరం నుంచి పైపు లైన్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని టైం బాండ్ ప్రొగ్రాంగా చేపట్టాలని జగన్ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేయడం విశేషం. అంతే కాదు, భోగాపురం నుంచి విశాఖ బీచ్ రోడ్డు వరకూ రోడ్ కనెక్టివిటీని తీసుకురావాలని, మొత్తం బీచ్ రోడ్డు ప్రాంతాన్ని సుందరీకరణ చేయాలని కూడా జగన్ అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: