మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోకుండా గెలిచినా కూడా పెద్ద గా ప్రజలికి వచ్చే సూచనలు కనపడడం లేదు.. జగన్ అధికారంలోకి రాగానే కరోనా మహమ్మారి వచ్చి అందరిని అతలాకుతలం చేసింది.. దాంతో ప్రతిపక్షాలు అన్నీ ఇంటిపట్టునే ఉన్నాయి.. ఇక చంద్రబాబు అయితే కరోనా అనే పేరు వినిపించనప్పటినుంచి ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికి అయన బయటికి రావట్లేదు అంటే ఆయనపై కరోనా ప్రభావం ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు..చంద్రబాబు తో పాటు లోకేష్ కూడా అప్పుడో ఇప్పుడో తప్పా కనిపించడంలేదు.

అయితే ఏపీ లో మరి కొన్ని రోజుల్లో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అధికార పార్టీ ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది.. ఈ సమావేశాలకు చంద్రబాబు వచ్చేది రానికేది కొంత అనుమానంగా ఉంది. 60 యేళ్ల వ‌య‌సు పైనున్న వారు బ‌య‌ట తిర‌గ‌డం మీద కూడా ప్ర‌స్తుతం ఒక‌రకంగా ఆంక్ష‌లు ఉన్న‌ట్టే. ప్ర‌భుత్వం కూడా ఆ వ‌య‌సు పై బ‌డిన వారు జ‌నం మ‌ధ్య‌కు రావొద్ద‌ని సూచిస్తూ ఉంది.

చంద్రబాబు కు వయసు 70 కి చేరువలో ఉండడంతో అయన ఇక్కడి ఎలా వస్తారన్నదే అసలు ప్రశ్న.. కేవ‌లం చంద్ర‌బాబే కాదు.. 60, 70 దాటిన ఏపీ ఎమ్మెల్యేలు కూడా స‌మావేశాల‌కు హాజ‌రు కావ‌డం అనుమానమే అని చెప్ప‌వ‌చ్చు. ఒకవేళ వారికి కరోనా వచ్చి ఏదన్నా జరిగితే అసెంబ్లీ కి చెడ్డపేరు అని భావిస్తున్నారట.. ఈ నేపథ్యంలో మరికొంతమంది ఈ సమావేశాలకు రాకపోవచ్చు.. దీనికి తోడు శీతా కాలం ఎఫెక్ట్ కూడా వారిని రావొద్దనడం సూచిస్తుంది. మిగితా వారు వ‌చ్చినా రాక‌పోయినా.. చంద్ర‌బాబు రాక‌పోతే మాత్రం అది వార్తే అవుతుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత అసెంబ్లీకి హాజ‌రు కాలేక‌పోతే.. టీడీపీ ప‌రిస్థితి వీల్ చైర్ ఎక్కిన‌ట్టుగా అవుతుంది కూడా. కాబ‌ట్టి ప‌ట్టుద‌ల‌గా తీసుకుని చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: