గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ సీన్ ఏంటి, ఆ పార్టీ ప్లేస్ ఏంటి. ఇదే ఇపుడు అంతటా చర్చగా ఉంది. బీజేపీ బలంగానే ఉందా. లేక వాపుని చూసి బలం అనుకుంటోందా అన్న లెక్కలు అన్నీ కూడా గ్రేటర్ పంచాయతీ తేల్చేయనుంది. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలకు ముందు ఉన్న సీన్ వేరు, ఇపుడు వేరు. ఇది మాత్రం సుస్పష్టం. ఈ విషయంలో కేసీయర్ కి పక్కా క్లారిటీ ఉంది. అందుకే హడావుడిగా ఎన్నికలను ఆయన జరిపించేస్తున్నారు.

ఇదిలా ఉంటే గ్రేటర్ హైదారాబాద్ ఎన్నికల్లో బీజేపీ బలం మూడు నుంచి అమాంతంగా  హాఫ్ సెంచరీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయా అంటే అవును అదే నిజమని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాటి చెబుతున్నారు. బీజేపీ ఇంతలా గ్రేటర్ మీద పట్టు బిగించడానికి కూడా అదే కారణం. యాభై సీట్లు కనుక బీజేపీకి వస్తే గ్రేటర్ లో రఫ్ ఆడించడం ఖాయమని కూడా అంటున్నారు.

మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎందుకో సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతోంది. ఎన్నికల ప్రచారంలో కూడా బాగా వెనకబడింది. దీంతో ఆ ప్లేస్ లోకి బీజేపీ దూసుకువచ్చేస్తోంది. గ్రేటర్ లో పట్టు దొరికిపోయింది అని బీజేపీ నిబ్బరంగా ఉండడానికి కూడా అదే కారణం.

ఇక గ్రేటర్ ఎన్నికల్లో టీయారెస్ ని ముప్పతిప్పలు పెడుతున్న బీజేపీ గతంలో టీయారెస్ కి వచ్చిన సీట్లలో సగానికి సగం తగ్గించే పనిలో బిజీగా ఉందిట. అదే కనుక జరిగితే మేయర్ పీఠం కోసం మజ్లీస్ తోనే టీయారెస్ పొత్తు పెట్టుకోవాలి. ఆ అనివార్యతను కల్పించడం ద్వారానే బీజేపీ గ్రేటర్ కోట మీద జెండా ఎగరవేయకపోయినా తన టార్గెట్ రీచ్ అయినట్లుగా భావిస్తోంది. టీయారెస్, మజ్లీస్ అధికారం పంచుకుంటే ఇక హిందూ కార్డు తో రానున్న రోజుల్లో మరింత జోరుగా దూసుకుపోవచ్చునన్నదే  బీజేపీ ఆలోచనగా ఉందిట. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: