ఎన్నికలు అనగానే ఎన్నో ఉంటాయి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ ప్రక్రియ విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. పది మంది పోటీ చేసి ఓట్లను పంచుకుంటే 11 ఓట్లు వచ్చిన వాడు విజేత కావచ్చు. అంతే 89 ఓట్లు యాంటీగా పడినా కూడా ఇది సాధ్యమే. ఇలాంటి చీలిక పేలికల వల్లనే బీహార్ లో దగ్గరదాకా వచ్చి కూడా  ఆర్జేడీ అధికారం పోగొట్టుకుంది.

ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలరైజేషన్ మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పోలింగుకు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ఓటర్ల తీరు ఎలా ఉంటుంది. పోలరైజేషన్ దేని మీద ఉంటుంది. ఏ వైపుగా ఓట్లు అన్నీ స్టాక్ అవుతాయి అన్నది ఇపుడు హాట్ హాట్ చర్చగా ఉంది. నిజానికి తలపండిన వారు కూడా ఇలాంటి విషయాల్లో పప్పులో కాలు వేస్తూంటారు.

ఎందుకంటే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక వేరుగానే ఉంటుంది. గతంలో అన్ని సీట్లు ఒక పార్టీకి వస్తే తరువాత ఎన్నికల్లో దారుణంగా ఓడిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ తీసుకుంటే ఈసారి పోలరైజేషన్ బీజేపీకి వైపుగా ఉంటుందని అంటున్నారు. సెటిలర్స్ ఓట్లతో పాటు, వైసీపీ టీడీపీ జనసేన ఓట్లు కూడా అన్నీ గుత్తమొత్తంగా బీజేపీకి పడే చాన్స్ ఉందని అంటున్నారు.

ఎందుకంటే అధికారంలో టీయారెస్ కి రెండు సార్లు అవకాశం ఇచ్చారు. గ్రేటర్ విషయం చూసుకుంటే 2016 ఎన్నికల్లో టీయారెస్ సెంటిమెంట్ దెబ్బకు ఒకసారి ఓటు చేశారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో పూర్తి మార్పు వస్తోంది. దానికి తోడు ఈసారి బలమైన ఆల్టర్నేషన్ గా బీజేపీ పుంజుకుని రెడీగా ఉంది.

పోటీలో ఉన్న కాంగ్రెస్ మెల్లగా తప్పుకుంటోంది. దాంతో అయితే  టీయారెస్ లేకపోతే బీజేపీ అన్న పొలిటికల్ సీన్ ని కావాలనే బీజేపీ తెచ్చిపెట్టింది. ఈ పరిణామం కచ్చితంగా బీజపీకి అనుకూలించేదే అంటున్నారు. టీయారెస్ మీద వ్యతిరేకత ఓట్లుగా మారి  బీజేపీ ఖాతాలోనే పడే అవకాశాలు ఉన్నాయి. టోటల్ గా చూస్తే గ్రేటర్ లో ఓటింగ్ పోలరైజేషన్ పూర్తిగా బీజేపీని పాజిటివ్ గా సాగే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు. దాంతో బీజేపీ అధ్బుతాలు సృష్టించినా ఆశ్చర్యం లేదన్న మాట కూడా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: