ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పోటీ టిఆర్ఎస్ బీజేపీ మధ్య నెలకొంది అయితే కాంగ్రెస్ కూడా తానేమీ తక్కువ తినలేదు అన్నట్టు ఎక్కువ స్థానాల్లో అభ్యర్థులు దింపి ఎలా అయినా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది అందుకు తగ్గట్టే రేవంత్ రెడ్డి లాంటి నేతలు ప్రచారాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బిజెపికి సవాలుగా మారాయి.

మొన్న దుబ్బాకలో రఘునందన్ రావు ని గెలిపించుకున్న బిజెపి ఇప్పుడు ఎలా అయినా హైదరాబాద్ లో కూడా సత్తా చాటి మేయర్ పీఠం మీద తమ అభ్యర్థులను కూర్చోబెట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది అందుకు తగ్గట్టే జాతీయ స్థాయి నుంచి నేతలు కూడా వరుసగా హైదరాబాద్ క్యూ కట్టారు. ఇప్పటికే నిన్న నడ్డా ఇక్కడ ప్రచారం నిర్వహించగా ఈ నెల 29న అంటే రేపు హైదరాబాద్ కు అమిత్ షా రానున్నారు.

ఆయన రేపు ఉదయం 10:30 కి హైదరాబాద్ చేరుకోనున్నారు. 11:30 కి భాగ్యలక్ష్మి ఆలయం సందర్శనకు వెళ్లనున్నారు. 12:15కు సికింద్రాబాద్,సనత్ నగర్ ,ఖైరతాబాద్, జూబ్లీహిల్స్  లలో రోడ్ షో నిర్వహించారు. 2 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెళ్ళనున్న అమిత్ షా 3 గంటలకు అమిత్ షా అక్కడే ప్రెస్ మీట్ కూడా నిర్వహించనున్నారు. రెండు గంటల పాటు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఆయన. ఆ రెండు గంటల సమయం పార్టీ నేతలతో ఓటింగ్ ఎలా పెంచుకోవాలి అనే అంశం మీద చర్చలు జరపనున్నారు షా. అనంతరం 7 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు అమిత్ షా.

మరింత సమాచారం తెలుసుకోండి: