గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హైదరాబాద్ లోని సంజీవ రెడ్డి నగర్ పోలీసులు నిన్న వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. బల్దియా ఎన్నికల రోడ్ షోల్లో పాల్గొన్న వీరిద్దరూ భావోద్వేగాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని సాక్ష్యాధారాలను సేకరించిన పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఎర్రగడ్డ పరిధి లోని సుల్తాన్‌ నగర్‌లో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అక్బరుద్దీన్ ఒవైసీ.. హుస్సేన్ సాగర్ ఆక్రమణలు ప్రస్తావిస్తూ.. 'దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయండి' అంటూ వ్యాఖ్యానించారు.

దీనికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం బల్కంపేట లో నిర్వహించిన ప్రచారంలో స్పందిస్తూ... 'అదే మీరు చేస్తే, రెండు గంటల్లో భాజపా కార్యకర్తలు దారుస్సలాంని కూల్చి వేస్తారని పేర్కొన్నారు. ఈ  వీరిద్దరి వ్యాఖ్యల మీద ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీఎస్ 505   కింద కేసు ఎస్ఆర్ నగర్ పోలిసులు నమోదు చేశారు. ఈ అంశం మీద బండి సంజయ్ స్పందిస్తూ నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చేసుకోనివ్వండి. అరెస్ట్ ఇవాళ చేస్తారా...రేపు చేస్తారా!? అని ప్రశ్నించారు.

కేసులకు, అరెస్ట్ లకు భయపడేది లేదు....నా వ్యాఖ్యలు సమర్ధించు కుంటానని ఆయన అన్నారు. మజ్లిస్ నేతలు మాట్లాడారు కాబట్టే నేను బదులు ఇచ్చాను, సమాధులు కూలుస్తా అంటే సీఎం ఎందుకు రియాక్ట్ కాలేదు అని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్ కు మద్దతుగా సీఎం ఉన్నాడు కాబట్టే...నేను బదులు ఇవ్వాల్సి వచిందని ఆయన అన్నారు. విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన మజ్లిస్ మీద ముందుగా సీఎం ఎందుకు కేసులు పెట్టించలేదని ప్రశ్నించారు. ప్రధాని పర్యటన పై trs చేస్తున్న రాద్ధాంతానికి అర్ధమే లేదని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: