వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠంపై బైడెన్‌ను ఎక్కకుండా చేయడానికి ట్రంప్ నానా అవస్థలు పడుతున్నారు. కానీ ప్రతి చోటా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తాజాగా పెన్సిల్వేనియా కోర్టు కూడా ట్రంప్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేసి షాక్ ఇచ్చింది. దీంతో ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. బైడెన్ గెలుపును అడ్డుకునేందుకు ట్రంప్ ప్రయోగించిన చివరి అస్త్రం కూడా ఫెయిల్ అయింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి కీలక రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో జో బైడెన్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రాష్ట్రంలో బైడెన్ గెలుపును ట్రంప్ ఒప్పుకోలేదు. ఆ రాష్ట్రంలో రిగ్గింగ్ జరిగిందని, బైడెన్ గెలుపుపై స్టే విధించాలని ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు కోరుతూ పిల్ ధాఖలు చేశాడు. అయితే ట్రంప్‌కు షాక్ ఇస్తూ కోర్టు ఈ పిటీషన్‌ను
కొట్టి పారేసింది. స్టే విధించేందుకు నిరాకరించింది. ఆరోపణలు చేసినంత మాత్రాన అవన్నీ నిజాలుగా మారవంటూ ట్రంప్‌‌నే తప్పుబట్టింది.


ఎన్నికల ఫలితాల్లో అవకతవకలున్నాయంటూ ట్రంప్ మొదట్నుంచీ గొంతు చించుకుంటున్నారు. దిగువ కోర్టులు, పై కోర్టులు అనే తేడా లేకుండా అన్ని కోర్టుల్లో ఇప్పటికే అనేకసార్లు కేసులు కూడా వేశారు. అయితే ప్రతి చోటా ట్రంప్‌కు ఎదురుదెబ్బలే తగిలాయి. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయంటూ గత వారం పెన్సిల్వేనియా రాష్ట్ర న్యాయ స్థానాన్ని ఆశ్రయించిన
 ట్రంప్‌కు నష్టం తప్పలేదు.


 రాష్ట్రంలో పోలైన కొన్ని వేల ఓట్లు చెల్లవని, అవకతవకలు జరిగాయని తీర్పు ఇవ్వాలంటూ ట్రంప్ తరఫు న్యాయవాది రూడీ గిలియాలని న్యాయమూర్తిని కోరారు. అయితే దానిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరూపించేందుకు సరైన ఆధారాలు చూపాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: