గ్రేటర్ ఎన్నికల పీఠానికి రంగురంగుల నిచ్చెనలు వేస్తున్నారు మన రాజకీయ నేతలు. జిహెచ్ఎంసి ఎన్నికల బరిలో విజయాన్ని దక్కించుకునేందుకు ప్రజల వద్దకు అభివృద్ధి అజెండాలతో బయలుదేరారు. ఏ పార్టీకి ఆ పార్టీ తామే ప్రజా సంక్షేమం కోరే నేతల మంటూ ప్రజల అవసరాలకు నిరంతరం అందుబాటులో ఉండే అన్నలమంటూ చెప్పుకొంటున్నారు. అదిరిపోయే మేనిఫెస్టో లతో క్వాలిటీ ప్రజా పాలన కు రెడీ అంటున్నారు..... ఇలా గ్రేటర్ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అధికార పార్టీ సైతం తన ఆధిక్యతను చూపుతోంది. ప్రచారాల కార్యక్రమాలను ఓ రేంజ్లో కొనసాగిస్తోంది.

కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఓవైపు ప్రజలకు హామీలు ఇస్తూనే మరోవైపు ప్రతిపక్షాలకు తన మాటల తూటాలతో విమర్శలు వెదజల్లుతున్నాడు. తమ నాయకత్వం ఎంత విశిష్టమైనదో గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్దే మాట్లాడుతుందన్నారు. తమ పాలనలో పారదర్శకత ప్రజలపై ప్రేమ అందిస్తూనే ఉన్నామన్నారు. ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం కొత్త పద్దతి కోసం ప్రయత్నాలు జరుపుతున్నామని.... ఒకవేళ కుదరని పక్షంలో కొన్ని రోజులు పాత పద్దతిలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ల రిజిస్ట్రేషన్ కోసం సీఎంతో మాడ్లాడి ఒప్పిస్తామని తెలిపారు. భూ వివాదాలు తలెత్తకుండా...తెలంగాణలో ప్రతి అంగుళం భూమిని డిజిటల్ సర్వే చేయబోతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

 తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టామన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో మంచినీటి సరఫరాను మెరుగు పరిచే విధానాలను చేపట్టి అన్ని ప్రాంతాలకు సరఫరా అయ్యేలా చూశామన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకునే  పథకాలను రచించామన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో 5 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాలలో 60 శాతం తెలంగాణలోనే ఉన్నాయని తెలిపారు. కొందరు నేతలు నగరం పేరు మారుస్తామన్నారు. కానీ భాగ్యనగరం పేరు మార్చినంత మాత్రాన బంగారం అవుతుందా అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి పథంలో ముందుకు పోతున్న భాగ్యనగరానికి నేమ్ చేంజర్స్
కావాలో లేక గేమ్ చేంజర్స్ కావాలో ప్రజలే ఎన్నుకోవాలని అన్నారు. భాగ్యనగరానికి మరిన్ని బంగారు మెరుగులు దిద్దడానికి మేము సిద్ధం.... అలాగే మాకు సహకరించడానికి మా ప్రజలు కూడా రెడీగా ఉన్నారని భావిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: