ఏపీలో ఇటీవల స్టేట్ బ్యాంకు లో జరిగిన దొంగతనం సంచలనం అయింది. ఈ దొంగతనం విషయంలో పోలీసులు కూడా చాలా వేగంగా స్పందించారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ దొంగతనం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఇక ఈ విషయంలో గుంటూరు పోలీసులు దూకుడుగా స్పందించారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా గుంటూరు రూరల్  ఎస్పీ విశాల్ గున్నీ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ ఘటన వివరాలను వెల్లడించారు. దాచేపల్లి మండల  నడికుడి స్టేట్ బ్యాంక్ చోరీ కేసులో నిందితుల అరెస్టు  చేసామని చెప్పారు. ఈ నెల 21 న స్టేట్ బ్యాంకు బ్యాంకులో 77 లక్షల  చోరీ చేసిన దొంగలను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరస్తులను పట్టుకున్నాం అని చెప్పారు. ఈ కేసులో తెలంగాణ లోని మిర్యాలగూడ కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కేదారి ప్రసాద్, వినయ్ రాములు ని అరెస్టు చేశాము అని ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన ఇద్దరికి గతంలో దొంగతనం చేసిన అనుభవం లేదు అన్నారు. కేవలం యూ ట్యూబ్ వీడియోలు చూసి దొంగతనానికి పాల్పడ్డారు అని   ఎస్పీ విశాల్ గున్నీ మీడియాకు తెలిపారు.. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల నుంచి బయటపడేందుకు దొంగతనం చేసినట్లు నేరస్తులు చెప్పారు అని ఆయన వివరించారు.

సిసి టీవి వైర్లు కత్తిరించారు, మాస్కులు ధరించారు, ఘటనా స్థలంలో కారం చల్లారు అని ఆయన పేర్కొన్నారు.  నేరస్తులు పట్టుబడకుండా చాలా  జాగ్రత్తలు తీసుకున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం అన్నారు. తక్కువ సమయంలో పోలీసులు దొంగలను అరెస్టు చేశారని ఆయన చెప్పారు. చోరీ చేసిన సొమ్ము మొత్తం రికవరీ చేశామని ఆయన అన్నారు. దేశంలో జరిగిన భారీ బ్యాంకు దొంగతనాల్లో ఇది కూడా ఒకటి అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: