గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. డిసెంబర్ 1న పోలింగ్ జరుగనుంది. దీంతో ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదివారం తో ప్రచారం ముగియనుంది.
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం, రోడ్ షో నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆయా కార్పొరేషన్ల, మున్సిపల్ కార్పొరేటర్లు, నాయకులతో ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది.  నోటిఫికేషన్ విడుదలైన అప్పటి నుంచి స్థానిక నేతలు హైదరాబాద్ లోనే మకాం వేశారు.

బీజేపీ సైతం అన్ని జిల్లాల నాయకులు, కార్యకర్తలతో ఇంటింటా ప్రచారం చేస్తోంది. ఎంపీలు బండి సంజయ్, ఆర్వింద్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. వీరితోపాటు జాతీయ స్థాయి నాయకులను ప్రచార రంగంలోకి దింపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు పడ్డా శుక్రవారం ప్రచారం చేయగా శనివారం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. అమిత్ షా కూడా ప్రచారానికి రానున్నారు.అన్ని డివిజన్లలో కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: