హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారం కోసం బీజేపి నేతలను సపోర్ట్ చెయ్యడానికి మోదీ హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా,ఇవాళ జినోమ్ వ్యాలీని సందర్శించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు అంతా జినోమ్ వ్యాలీ గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. జినోమ్ వ్యాలీ ఇప్పుడు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అయింది. ఇంతకీ ఏంటీ జినోమ్ వ్యాలీ. ఎందుకు అది స్పెష‌ల్ అనుకుంటున్నారా ? దానికి చాలా పెద్ద కారణమే ఉంది. ‘జినోమ్‌ వ్యాలీ ఆసియాలోనే అతిపెద్ద బయోటెక్నాలజీ, జీవ శాస్త్రాల క్లస్టర్‌.. ఈ జీనోమ్ వ్యాలీ 1200 ఎకరాల్లో నిర్మించారు.



18 దేశాలకు చెందిన 200 కంపెనీలు అక్కడ రీసెర్చ్ చేస్తున్నాయి. ఆ ఘనత చంద్ర బాబు నాయుడుకే దక్కుతుంది.ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కట్టించారు అంటూ కేటీఆర్ బాబు పై ప్రశంసలు కురిపించారు.ఆనాడు ముందు చూపుతో డెవలప్ చేసిన జినోమ్ వ్యాలీ. ఈ రోజు దేశాన్ని కాపాడేందుకు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పనితో ఇవాళ ఇంత మేలు జరుగుతుందన్నారు చంద్రబాబు. అంతేకాదు తాజాగా కేటీఆర్ అసెంబ్లీ వేదికగా జినోమ్ వ్యాలీ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడుకు ఇస్తూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.



మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఎవరు చేస్తే వారికి ఆ క్రెడిట్ ఇస్తాము.. ఆ ఘనత చంద్ర బాబు నాయుడు ఇస్తున్నాం అంటూ కేటీఆర్ అన్నారు. ఇకపోతే ఈరోజు హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ ముందుగా జీనోమ్ వ్యాలిని సందర్శించనున్నారు.. జినోమ్ వ్యాలీ టాప్ లిస్ట్ లో ఉంది . లైఫ్ సైన్స్ లో జినోమ్ వ్యాలీ దేశం మొత్తానికే ఆద‌ర్శం అని కూడా చెప్పొచ్చు. క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలో కూడా జినోమ్ వ్యాలీనే ముందు వ‌రుసలో ఉంది. బ‌యోటెక్ ఎక్స్ ప‌ర్టులు క‌రోనా వ్యాక్సిన్ పై రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నారు.. మన దేశంలో తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది అంటూ ఆయన అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: