ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కరోనా వైరస్ ఇప్పుడు మెల్ల మెల్లగా తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ తుఫాన్ వచ్చి జనాలను అల్ల కల్లోలం చేస్తుంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి..ఆంధ్రప్రదేశ్ కి భారీ ప్రమాదం వుంది. ప్రస్తుతం తీవ్రంగా వున్న నివర్  తుఫాన్ బీభత్సం నుంచి తేరుకోక మునుపే  మరోసారి వాయుగుండం, తుఫాన్‌ల ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని వాతావరణం శాఖ నుంచి సమాచారం అందింది. నివర్‌ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దీనికి దగ్గరగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందట.

దీంతో  కోస్తాంధ్రలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం పుష్కాలంగా  ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శని, ఆదివారాల్లో ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటూ మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు జనాలని హెచ్చరిస్తున్నారు.

ఇటు తూర్పున చూసుకున్నట్లయితే  హిందూ మహాసముద్రం-దక్షిణ అండమాన్‌ సముద్రం మీద 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందట. ఈ ప్రభావంతో రానున్న 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా అరేబియా సముద్రం వైపు పయనించి డిసెంబర్‌ 2 తర్వాత తుఫాన్‌గా మారే సూచనలున్నాయని చెబుతున్నారు.


మరోవైపు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వచ్చే నెల 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇలాంటి మరెన్నో అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.

మరింత సమాచారం తెలుసుకోండి: